కరోనాకి తోడు బ్రూసెలోసిస్.. 6వేల మంది ఆ వ్యాధి బారిన..

కరోనాకి తోడు బ్రూసెలోసిస్.. 6వేల మంది ఆ వ్యాధి బారిన..
ఫ్లూ లాంటి లక్షణాలతో బ్రూసెలోసిస్ వస్తుంది.

వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌలో 6,000 మందికి పైగా బ్రూసెలోసిస్ అనే బ్యాక్టీరియా శరీరంలో చేరినట్లు స్థానిక ప్రభుత్వం పేర్కొంది. నగరంలో 55,725 మందిని ప్రభుత్వం పరీక్షించగా వీరిలో 6,620 మంది బ్రూసెలోసిస్‌ బారినపడినట్లు లాన్‌జౌ ప్రభుత్వం విలేకరుల సమావేశంలో తెలిపింది. గ్లోబల్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 14 నాటికి బ్రూసెల్లోసిస్ 3,245 పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, వైరస్ సోకిన జంతువులతో ప్రత్యక్ష సంబంధం ద్వారా, కలుషితమైన జంతు ఉత్పత్తులను తినడం గాలిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లను పీల్చడం ద్వారా మానవులకు ఫ్లూ లాంటి లక్షణాలతో బ్రూసెలోసిస్ వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారిలో కొన్ని లక్షణాలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడతాయి. మరికొందరికి ఆ లక్షణాలు జీవితాంతం అలాగే ఉంటాయి.

సెప్టెంబరు నాటి లాన్జౌ యొక్క ఆరోగ్య కమిషన్ నుండి వచ్చిన ఒక ప్రకటన ప్రకారం, చైనా జంతుపరిశోధనశాల యాజమాన్యంలోని బయోఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో ఈ వ్యాప్తి ఏర్పడింది. కర్మాగారం బ్రూసెలోసిస్ వ్యాక్సిన్ల తయారీకి జూలై నుండి ఆగస్టు 2019 వరకు గడువు ముగిసిన క్రిమిసంహారక మందులను ఉపయోగించింది, బ్యాక్టీరియాను కలుషితమైన వ్యర్థ వాయువులతో కలిపి వదిలివేసింది. అధికారిక దర్యాప్తు ఫలితాలను ఉటంకిస్తూ ఈ విషయాన్ని పేర్కొంది. ఇక్కడ బ్రూసెలోసిస్ వ్యాప్తి మొదటిసారిగా గత నవంబర్‌లో నమోదైందని ఆరోగ్య కమిషన్ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story