WAR: మాస్కో ఎయిర్‌పోర్ట్‌పై దాడి.. వణికిపోయిన ప్రయాణికులు

WAR: మాస్కో ఎయిర్‌పోర్ట్‌పై దాడి.. వణికిపోయిన ప్రయాణికులు
రష్యా ప్రధాన భూభాగంపై మళ్లీ డ్రోన్ల దాడి... 500 కిలోమీటర్లు దాటి వచ్చి దాడి.. నిర్వెరపోయిన ప్రపంచం...

రష్యా భూభాగంపై మరోసారి దాడి జరిగడం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. కెర్చ్ వంతెనపై దాడి ఘటనను మరచిపోకముందే మరోసారి రష్యా ప్రధాన భూభాగంపై డ్రోన్ల దాడి జరిగింది. ఈ పని చేసింది ఉక్రెయినే(Ukrainian drones) అని రష్యా ఎప్పటిలానే ఆరోపించింది. కానీ ఉక్రెయిన్‌ సరిహద్దుకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాస్కో(Russia's capital Moscow )పై ఉక్రెయిన్‌ దాడి చేయడం రష్యా భద్రతా నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేసిందన్న విమర్శలు వస్తున్నాయి.


రష్యా (Russia) రాజధాని మాస్కో(Mosow)పై డ్రోన్లు(Ukrainian drones) విరుచుకుపడ్డాయి. మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయమే (shut an international airport. )లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ ఎలక్ట్రానిక్‌ వార్ఫేర్‌ వ్యవస్థ ఒక డ్రోన్‌ను కూల్చివేసిందని పేర్కొంది. ఈ దాడిలో విమానాశ్రయానికి చెందిన రెండు భవనాలు దెబ్బతిన్నాయని వెల్లడించింది. మొత్తం మూడ డ్రోన్లు ఈ దాడిలో పాల్గొన్నాయని, ఈ దాడి వెనుక ఉక్రెయిన్‌ ఉందని మాస్కో ఆరోపించింది. దీనిని ఉగ్రదాడిగా అభివర్ణించింది.

జులై 30వ తేదీ ఉదయం కీవ్‌ పాలకులు మానవ రహిత విమానంతో ఉగ్ర దాడికి యత్నించారని.. ఆ దానిని తాము భగ్నం చేశామని రష్యా ప్రకటించింది. ఒక ఉక్రెయిన్‌ డ్రోన్‌ను కూల్చేశామని, మరో రెండు డ్రోన్లు కూడా తమ ఎలక్ట్రానిక్‌ వార్ఫెర్‌ వ్యవస్థ దెబ్బకు నియంత్రణ కోల్పోయి రెండు భవనాలపై కూలిపోయాయని మాస్కో రక్షణశాఖ( Russian Defence Ministry) వెల్లడించింది. రెండు ఆఫీస్‌ టవర్లు స్వల్పంగా దెబ్బతిన్నాయని రష్యా మేయర్‌ సెర్గీ సోబియన్‌ పేర్కొన్నారు. మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్‌లు దాడి చేశాయని, ఎటువంటి ప్రాణనష్టం లేదని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్( Moscow Mayor Sergey Sobyanin) వెల్లడించారు. డ్రోన్ దాడి కారణంగా భవనం మొదటి నుంచి నాలుగో అంతస్తు వరకు గాజు ఫలక పగిలిపోయిందని వెల్లడించారు.


సరిహద్దులకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలోని మాస్కోపై డ్రోన్‌ దాడి జరగడం ఆదేశ సైన్యాన్ని కూడా ఆశ్చర్యపరుస్తోంది. ఈ దాడిలో ఒకరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కాసేపు మూసివేశారు. ఇక్కడికి వచ్చే విమానాలను దారి మళ్లించినట్లు పేర్కొంది. దాదాపు గంట తర్వాత ఇక్కడ రాకపోకలను పునరుద్ధరించారు.

ఉక్రెయిన్‌(Ukraine) అమ్ములపొదిలోని పడవ డ్రోన్లు రష్యా(Russia)ను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇటీవల క్రిమియాను రష్యా ప్రధాన భూభాగంతో కలిపే కెర్చ్‌ వంతెన (Crimea bridge) వద్ద కూడా భారీ పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. వంతెన పాక్షికంగా కూలిపోయింది. ఇప్పటికే గతేడాది ఓ సారి ఈ వంతెనపై భారీ దాడి జరగడంతో రష్యా ఇక్కడ భద్రతను గణనీయంగా పెంచింది. అయినా.. దీనిపై తాజాగా దాడి జరిగింది. పేలుడు తీవ్రతకు వంతెనలోని ఓ వైపు భాగం కుంగిపోయింది. ఫలితంగా ఇక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

Tags

Read MoreRead Less
Next Story