Bluefin Tuna Fish: జపాన్‌ వేలంలో ఆ చేప ధర ఆరున్నర కోట్ల ధర

ప్రపంచంలోనే ఖరీదైన చేప

ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేపగా పేరున్న బ్లూఫిన్‌ ట్యూనా రకానికి చెందిన చేపకు జపాన్‌లో ఆరున్నర కోట్ల ధర పలికింది. జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగిన వార్షిక వేలంలో బ్లూఫిన్‌ ట్యూనా చేప 114.24 మిలియన్‌ యెన్‌ల ధర పలికింది.ఇది 7 లక్షల 88 వేల 471 అమెరికా డాలర్లకు సమానం కాగా భారత కరెన్సీలో ఆరున్నర కోట్లకుపైనే ఉంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి వేలంలో బ్లూఫిన్‌ ట్యూనా చేప ధర మూడురెట్లు పెరిగినట్టు... నిర్వాహకులు తెలిపారు. ఈ బ్లూఫిన్‌ ట్యూనా చేప బరువు 238 కిలోలు కాగా అమోరి ప్రిఫెక్చర్‌లోని ఓమా అనే ప్రాంతంలో ఈ చేపను పట్టుకున్నట్టు తెలిపారు. టోక్యోలోని సుషీ రెస్టారెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ అకిఫుమి సకాగామి ఆ చేపను కొనుగోలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story