tornado: ‌అమెరికాలో టోర్నడో బీభత్సం

tornado: ‌అమెరికాలో టోర్నడో బీభత్సం
అమెరికాలో బీభత్సం సృష్టించిన టోర్నడోలు... చికాగోపై విరుచుకుపడిన సుడిగాలి... పలు విమానాలు రద్దు...

అమెరికాలో టొర్నడో(tornado)లు బీభత్సం సృష్టించాయి. చికాగో‍(Chicago)పై విరుచుకుపడి తీవ్ర నష్టం మిగిల్చాయి. భారీ టొర్నడోల ధాటికి పౌరజీవనం ఒక్కసారిగా స్తంభించింది. ప్రాణనష్టం గురించి సమాచారం లేనప్పటికీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓహెరే విమానాశ్రయానికి అతి సమీప ప్రాంతాల్లో సుడిగాలులు విరుచుకుపడగా వందలాది విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. సుడిగాలి వల్ల 173 విమానాలను రద్దు చేశామని, 500 మంది ప్రయాణికులు చికాగోలోని ఓ హేర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.


మెక్‌హెన్రీ, కుక్‌కౌంటీలలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్ల పైకప్పులు ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. టొర్నడోలు చికాగో మీదుగా తూర్పునకు మళ్లుతున్నట్లు నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ తెలిపింది. మిచిగాన్‌, ఇండియానా, ఒహియో రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు వెర్మోంట్ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలలో వరద తగ్గుముఖం పట్టింది. కేవలం 2 రోజుల్లోనే 2 నెలల వర్షపాతం అక్కడ నమోదైంది. రాజధాని నగరం మాంట్‌పెలియర్‌లో వినోస్కీ నది ఉప్పొంగి ప్రజల ఇళ్లను వరద ముంచెత్తింది. ఇప్పటిడిప్పుడే వరద తగ్గడంతో ప్రజలు సాధారణ జీవనానికి అలవాటు పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story