విచిత్రం.. బిడ్డ పుట్టేవరకు గర్భం దాల్చిన విషయం ఆమెకు తెలియదు

విచిత్రం.. బిడ్డ పుట్టేవరకు గర్భం దాల్చిన విషయం ఆమెకు తెలియదు
కడుపులో బిడ్డ పెరుగుతుందన్న విషయం ఆమెకే తెలియకపోవడం. ఓ గంటలో డెలివరీ చేయాలి అని డాక్టర్లు చెప్పాగానే ఆమె అవాక్కయ్యింది.

కొన్ని సంఘటనలు వినడానికి చాలా విచిత్రంగా ఉంటాయి.. కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో ఇంట్లో కూర్చుని .. చిప్సూ, ఛీజ్ లాంటివన్నీ లాగించేయడంతో బరువు పెరుగుతున్నానని అనుకుంది కానీ గర్భం ధరిచానని అసలు ఊహించలేకపోయింది.

టాషాడేవిస్‌, మార్టిన్‌ హెర్న్‌ దంపతులు ఇంగ్లండ్‌లోని విగన్‌లో నివాసం ఉంటున్నారు. వారికి మూడున్నరేళ్ల క్రితం పెళ్లైంది. మంగళవారం ఉదయం 6 గంటలకు తాషా డేవిస్ (28) కడుపునొప్పి భరించలేక ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో బిడ్డ పెరుగుతోంది. ఓ గంటలో ఆపరేషన్ చేసి బయటకు తీయాలి.. లేకపోతే ఇద్దరికీ చాలా ప్రమాదం అని చెప్పి వైద్యం మొదలు పెట్టారు. గంటకు పైగా శస్త్ర చికిత్స చేసి 9 పౌండ్లు ఉన్న మగ బిడ్డను బయటకు తీశారు. తాషా బిడ్డను చూసి చాలా ఆశ్చర్యపోయింది. నాకు ఏ విధమైన అనారోగ్యం లేదు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు సంబంధించి ఎటువంటి లక్షణాలు కనిపించలేదు అని వైద్యులకు వివరించింది. అయితే 24 గంటల నుంచి బొడ్డు ఉబ్బి తీవ్రమైన కడుపు నొప్పి వస్తోంది. కడుపులో ఏవో సంకోచాలు ప్రారంభమైనప్పుడు అనుమానం వచ్చింది. కడుపులో ఏమైనా ఉందేమో అనుకుంది కానీ అప్పటికి కూడా బిడ్డ పెరుగుతుందేమో అని ఊహించలేకపోయింది.

తాషా భర్త మార్టిన్ హెర్న్(29) మాట్లాడుతూ మేము ఆసుపత్రికి వెళ్ళినప్పుడు డాక్టర్ కి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు అని అన్నారు. "తాషాను నర్సు చూసి చికిత్స కోసం తీసుకువెళ్లింది. నేను కారిడార్లో వేచి ఉన్నాను."పదిహేను నిమిషాల తరువాత ఒక నర్సు వచ్చి నన్ను పిలిచి చెప్పింది. తాషాని డెలివరీ సూట్కు తీసుకువెళుతున్నారని చెప్పారు. గంటలో ఆపరేషన్ చేసి బేబీ బాయ్ ని బయటకు తీసి బాబుని చూడ్డానికి లోపలికి రమ్మని పిలిచారు అని ఆ ఉద్వేగ క్షణాలను గుర్తు చేసుకున్నాడు హెర్న్.

Tags

Read MoreRead Less
Next Story