అంతర్జాతీయం

Mustafa Al-Kadhimi: ఇరాక్‌ ప్రధానిపై హత్యాయత్నం.. దుండగుల ప్రయత్నం విఫలం..

Mustafa Al-Kadhimi: ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌ కధిమిపై హత్యాయత్నం జరిగింది.

Mustafa Al-Kadhimi (tv5news.in)
X

Mustafa Al-Kadhimi (tv5news.in)

Mustafa Al-Kadhimi: ఇరాక్‌ ప్రధాని ముస్తఫా అల్‌ కధిమిపై హత్యాయత్నం జరిగింది. దాడి విఫలమవడంతో క్షేమంగా బయటపడ్డారు ప్రధాని. దాడిలో ఐదుగురు గాయపడ్డారు. దీంతో వీరిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అత్యంత భద్రత నడుమ ఉండే ప్రధాని ముస్తఫా నివాసంపై తెల్లవారుజామున డ్రోన్‌ దాడి చేశారు దుండగులు.

డ్రోన్‌ దాడితో అప్రమత్తమైన ఆర్మీ.. ప్రధాని ముస్తఫాను సురక్షిత ప్రాంతానికి తరలించింది. అత్యంత భద్రత నడుమ గ్రీన్‌ జోన్‌లో ఉండే ప్రధాని ఇంటిపై డ్రోన్‌ దాడి జరగడంపై ఇరాక్‌ ఆర్మీ అలర్టయింది. దాడికి బాధ్యత వహిస్తూ ఎవరూ ప్రకటన చేయలేదు. తాను క్షేమంగా ఉన్నాట్లు చెప్పారు ఇరాక్ ప్రధాని ముస్తఫా. దేశ ప్రజలంతా శాంతియుతంగా, సంయమనంతో ఉండాలన్నారు.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES