NASA: అంతరిక్షంలో గ్రీన్ మాన్‌స్టర్‌.. గుట్టు విప్పిన నాసా

NASA: అంతరిక్షంలో గ్రీన్ మాన్‌స్టర్‌.. గుట్టు విప్పిన నాసా
నక్షత్ర విస్ఫోటనమే కారణం

గత ఏడాది ఏప్రిల్‌లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కొన్ని ఫొటోలను తీసింది. అందులో అంతరిక్షంలో గ్రీన్ మాన్‌స్టర్ (గ్రించ్)ను పోలి ఉన్న అసాధారణ ఆకుపచ్చ కాంతి కనపడింది.

ఆ విచిత్ర కాంతి ఏంటన్న విషయంపై అధ్యయనం చేసిన నాసా శాస్త్రవేత్తలు తాజాగా వివరాలు తెలిపారు. నక్షత్ర విస్ఫోటనం వల్ల చెల్లాచెదురైన శిధిలాల చివరన ఈ కాంతి ఏర్పడిందని చెప్పారు. భూమికి 11 వేల కాంతి సంవత్సరాల దూరంలోని ‘కాసియోపియా ఏ’ వద్ద ఆ కాంతి కనపడిందని వివరించారు.

భారీ స్థాయిలో ఉండే ఉష్ణోగ్రత కారణంగా ఇటువంటి విస్ఫోటనాలు జరుగుతాయి. నక్షత్రంలోని ఆకర్షక శక్తి దాన్ని కుచించుకుపోయేలా చేస్తుంది. దీంతో నక్షత్రం నుంచి పీడనం బయటకు వచ్చేస్తుంది. నక్షత్రంలో చివరకు పీడనం తగ్గి, ఆకర్షణ శక్తే పై స్థాయి సాధిస్తుంది. నక్షత్రం మరింత కుచించుకుని, బయటి భాగం విస్ఫోటనం చెందుతుంది.

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గత ఏడాది తీసిన ఫొటోలోని దృశ్యాలు.. రెడ్ క్లౌడ్స్, మెరిసిపోతున్న తెల్లటి చారలు, ఎరుపు, నారింజ రంగు మంటలు, ఆకుపచ్చ మెరుపు రంగులో గుండ్రటి ఆకారంతో ఉన్న విద్యుత్ కాంతి డిస్క్‌ను పోలి ఉంది. అక్కడి నుంచి ఎక్స్-కిరణాలు సాధారణంగా నీలం రంగులో ఉండి, వేడి వాయువును వెలువర్చుతాయి. విస్ఫోటనం చెందిన నక్షత్ర శిధిలాల నుంచి సిలికాన్, ఇనుము వంటి మూలకాలు బయటకు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల వల్ల అక్కడ గత ఏడాది గ్రీన్ మాన్‌స్టర్ (గ్రించ్)ను పోలి ఉన్న అసాధారణ ఆకుపచ్చ కాంతి కనపడింది.

Tags

Read MoreRead Less
Next Story