Aliens: ఏలియన్స్ పై నాసా ఏం చెప్పిందో తెలుసా

Aliens: ఏలియన్స్ పై నాసా ఏం చెప్పిందో తెలుసా
శాస్త్రీయ పద్ధతిలో తేల్చిన నాసా

మెక్సికో ప్రదర్శన తో ఏలియన్స్ ఉన్నాయో లేదో అన్న చర్చ మరోసారి మొదలయ్యింది. నిజానికి ఆ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ లను గ్రహాంతర వాసులే పంపుతున్నారా? అనే అంశాలపై చాలా కాలంగా ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. ఏలియన్స్ ఉన్నాయన్న కచ్చితమైన ఆధారాలను ఇప్పటి వరకు ఎవరూ బయట పెట్టలేక పోయారు. గ్రహాంతర జీవులు ఉన్నట్టు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవంటూనే అమెరికా అన్‌ఐడెంటిఫైడ్‌ అనోమలస్‌ ఫినామినా (యూఏఎఫ్‌)లపై పరిశోధనలు చేసేందుకు పరిశోధకుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అన్‌ఐడెంటిఫైడ్‌ ఫ్లైయింగ్‌ ఆబ్జెక్ట్‌ (యూఎఫ్‌వో)ల గురించి పరిశోధనలు చేసేందుకు గతంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఏర్పాటు చేసిన యూఎఫ్‌వో స్టడీ టీం తన నివేదికను గురువారం నాసాకు సమర్పిచింది.

ఏలియన్స్ గురించి ఊహాజనిత విషయాలను చాలా మంది చెప్పారు. వారు యూఎఫ్‌వోలు అంటే మనం ఫ్లయింగ్‌ సాసర్లు అని పిలిచే వాటిలో ప్రయాణిస్తారు అని కూడా భావిస్తారు. అయితే, వీటిపై అధ్యయనం చేసిన నాసా.. గ్రహాంతర వాసుల గురించి వివరించేందుకు రెడీ అయింది. అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫెనోమినాపై అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ఓ స్వతంత్ర అధ్యయన టీమ్ సంవత్సరం నుంచి పరిశోధనలు చేసింది.


2022లో నాసా ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ టీమ్ ఏలియన్లపై నివేదిక ఇచ్చింది. ఇతర గ్రహాల నుంచి అప్పుడప్పుడు యూఎఫ్‌వోలు వచ్చి భూమిని సందర్శించి వెళ్తుంటాయని చెబుతుంటారు. కొన్ని దశాబ్దాల క్రితం ఆకాశంలో గ్రహాంతరవాసులు పదే పదే కనపడేవని అమెరికాకు చెందిన పలువురు చెప్పారు. యూఎఫ్‌వోల గురించి యూఏపీ స్వతంత్ర అధ్యయన బృందం శాస్త్రీయ పద్ధతిలో పరిశోధన చేసి.. రిపోర్ట్ రెడీ చేసింది. యూఎఫ్‌వోల గురించి వీలైనంత క్షుణ్ణంగా ఆ టీమ్ అధ్యయనం చేసింది. కానీ గ్రహాంతర జీవులు, యూఎఫ్‌వోల గురించి సరైన సాక్ష్యాధారాలు తమకు లభించలేదని వెల్లడించింది.

యూఎఫ్‌వోల గుట్టును ఈ బృందం విప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది . యూఎఫ్‌వోలకు సంబంధించిన గ్రహాంతర వాసులు ఉన్నారన్న ఆధారాలు ఏం లేవని చెప్పింది. ఈ బృందంలో మొత్తం 16 మంది సభ్యులు ఉన్నారు. యూఎఫ్‌వోలపై హై-క్వాలిటీతో అధ్యయనాలు జరిగినప్పటికీ, ఇప్పటివరకు శాస్త్రీయంగా ఆ అధ్యయనాలకు తుది రూపు ఇచ్చిన వారు లేరని నాసా వెల్లడించింది. మరోవైపు విశ్వంలో ఏదో ఒక చోట కచ్చితంగా జీవం ఉండొచ్చని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ పేర్కొనడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story