NASA: 8 నెలల క్రితం అంతరిక్షంలో మిస్సైన టమాటాలు దొరికాయి కానీ

NASA: 8 నెలల క్రితం అంతరిక్షంలో మిస్సైన  టమాటాలు దొరికాయి కానీ
ఎలా అయ్యాయంటే....

అంతరిక్షంలో 2 టమాటాలుతప్పిపోయాయి. వాటి గురించి తెగ వెతికారు.. ఫలితం లేదు.. ఆశలు వదిలేసుకున్నారు. కానే ఇదిగో ఇప్పుడు దొరికాయి. అయితే వాటిలో పెద్దగా మార్పు లేదు .. టమాటాలు కొంత రంగు మారిపోయి మెత్తబడ్డాయని నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. సూక్ష్మజీవులు లేదా శిలీంధ్రాల పెరుగుదల కనిపించలేదని స్పష్టం చేశారు. అసలు ఏం జరిగిందంటే

మట్టి లేని మొక్కల పెంపక ప్రయోగం ‘ఎక్స్‌పోజ్డ్ రూట్ ఆన్-ఆర్బిట్ టెస్ట్ సిస్టమ్’లో భాగంగా అంతరిక్షంలో వ్యోమగామి ఫ్రాంక్ రూబియో రెండు చిన్నచిన్న టమాటాలను తెంపుతున్న సమయంలో అవి చేతల నుంచి జారి పోయాయి. ఆ తర్వాత కనిపించకుండా పోయాయి.

ఆమధ్య టమాటాలు కనిపించడం లేదని ఫ్రాంక్ రూబియో చెబితే ఆయనే తినేసి ఉంటారని అంతా సరదాగా పంచులు వేశారని, ఎట్టకేలకు అవి కనిపించాయని, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సిబ్బంది ఇటీవలే వాటిని గుర్తించారని సానా వివరించింది. దీంతో చిన్నపాటి రహస్యానికి ముగింపు పడిందని, రూబియో టమాటాలు తినలేదని నిరూపితమైందని ఈ సందర్భంగా సరదాగా వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను నాసా శుక్రవారం యూట్యూబ్ వేదికగా పంచుకుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో అటూ ఇటూ తిరుగాడిన టమాటాలను ఎట్టకేలకు 8 నెలల తర్వాత ఓ ప్లాస్టిక్ బ్యాగులో గుర్తించారు.

కాగా మట్టి లేదా ఇతర వృద్ధి మాధ్యమాలు లేకుండా మొక్కల పెంపకంపై దృష్టి సారించిన సాసా ఎక్స్‌రూట్స్ ప్రయోగాన్ని చేపట్టింది. హైడ్రోపోనిక్, ఏరోపోనిక్ పద్ధతుల ద్వారా మొక్కల పెంపకంపై ప్రయోగాలు చేస్తోంది. ద్రవ్యరాశి, పారిశుద్ధ్య సమస్యలు, ఇతర అంశాల కారణంగా ప్రస్తుతం అంతరిక్ష వాతావరణంలో మొక్కలు చక్కగా పెరగకపోవచ్చునని, ఎక్స్‌రూట్ ప్రయోగం విజయవంతమైతే మట్టి తక్కువ పద్ధతుల్లో భవిష్యత్తులో మొక్కల విధానాలకు పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నట్టు ఈ సందర్భంగా నాసా పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story