Nasa : ఆకాశంలో వజ్రపు ధగ ధగ..

Nasa : ఆకాశంలో వజ్రపు ధగ ధగ..
అది నిజంగానే డైమండ్ ఇన్ ద స్కై

నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ చేసిన ఓ ఫోటో అందరినీ అబ్బురపరుస్తోంది. సౌర వ్యవస్థలోని అతి చిన్న గ్రహం మెర్క్యురీ ఫొటోను నాసా షేర్ చేసింది. గ్రహం చుట్టూ తిరుగుతున్న మొట్టమొదటి నాసా వ్యోమ నౌక మెసెంజర్ క్యాప్చర్ చేసిన ఈ అద్భుతమైన ఫొటోను నాసా ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ చిత్రంలో బుధ గ్రహం దేదీప్యమానంగా వెలుగుతోంది.


అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తరచుగా అంతరిక్షంలోని అద్భుతాలను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా మన సౌర కుటుంబంలోని అతి చిన్న గ్రహం అయిన బుధుడికి సంబంధించి ఒక స్టన్నింగ్ ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. నీలి రంగు షేడ్స్‌తో పాటు కొద్దిగా పసుపు, బ్రౌన్ కలర్లతో.. ఒక వజ్రం మెరిసినట్టు మెరుస్తున్నాడు బుధుడు. ఈ గ్రహం ఉపరితలంపై క్రేటర్స్ అంటే గుంతలు కూడా మనం గమనించవచ్చు. ఈ ఫోటోని మెసెంజర్ అనే అంతరిక్ష నౌక బంధించింది. బుధుడు ఉపరితలంపై ఉన్న రాళ్లల్లో రసాయన, ఖనిజ, భౌతిక వ్యత్యాసాల్ని గుర్తించేందుకు ఇలా రంగుల మయమైన ఫోటోని మెసెంజర్ క్యాప్చర్ చేసింది. బుధుడి భూగర్భ శాస్త్రం, అయస్కాంత క్షేత్రం, రసాయన కూర్పును అధ్యయనం చేయడమే ఈ మెసెంజర్ లక్ష్యం.

ఈ ఫోటోని నాసా సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ‘‘బుధుడు గ్రహాన్ని మిస్టర్ ఫారన్‌హీట్ అని పిలుస్తారు. సైజులో చంద్రుని కంటే కొంచెం పెద్దగా ఉండే ఈ గ్రహం.. మన సౌర కుటుంబంలోనే అత్యంత చిన్నది. ఇది సూర్యునికి 58 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రహం చిన్నదే అయినప్పటికీ తన ఆర్బిట్ చుట్టూ అత్యంత వేగంగా తిరుగుతుంది. సెకనుకి 47 కిలోమీటర్ల వేగంతో ఇది చక్కర్లు కొడుతుంది. ఈ గ్రహంపై ఒక సంవత్సర కాలం.. భూమికి 88 రోజులతో సమానం. బుద్ధుడి కలర్‌ఫుల్ ఫోటోని మెసెంజర్ అనే స్పేస్‌క్రాఫ్ట్ తీసిందని తెలిపింది.


ఈ గ్రహం చాలావరకు ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం, పొటాషియంతో కూడిన సన్నని ఎక్సోస్పియర్‌ను కలిగి ఉంటుంది. వాతావరణం లేకపోవడం, సూర్యునికి దగ్గరగా ఉండటంతో.. పగటిపూట పగటిపూట 800ºF (430ºC) నుండి రాత్రికి -290 ºF (-180 ºC) వరకు ఉష్ణోగ్రతలో మార్పులు చోటు చేసుకుంటాయి. భూమితో పోలిస్తే దీని అయస్కాంత క్షేత్రం చాలా బలహీనమైనది’’ అని నాసా పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story