NASA: ల్యాండ‌ర్‌ను ఫోటో తీసిన నాసా ఆర్బిటార్‌..

NASA:  ల్యాండ‌ర్‌ను ఫోటో తీసిన నాసా ఆర్బిటార్‌..
దక్షిణ ద్రువానికి 600 కిలోమీట‌ర్ల దూరంలో విక్ర‌మ్..

అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా(NASA)కు చెందిన లూనార్ రిక‌న్నై’సెన్స్’ ఆర్బిటార్ ప్ర‌స్తుతం చంద్రుడి చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ శాటిలైట్‌ కెమెరాకు చంద్ర‌యాన్‌-3కి చెందిన విక్ర‌మ్ ల్యాండ‌ర్ చిక్కింది. విక్ర‌మ్‌ను ఆ ఆర్బిటార్ ఫోటో తీసింది. ఆ ఫోటోల‌ను నాసా త‌న సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

ప్రపంచాన్ని అబ్బురపరిచేలా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై ఇస్రో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. లేటెస్ట్ అప్డేట్స్​కు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ప్రజల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే తాజాగా చంద్రయాన్-3కి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. అయితే ఈసారి ఈ అప్డేట్ ఇచ్చింది ఇస్రో కాదు.. అమెరికాకు చెందిన నేషనల్‌ ఏరోనాటిక్స్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌(నాసా). నాసా చంద్రయాన్‌-3 ల్యాండర్‌ చిత్రాన్ని ఎక్స్‌(ట్విటర్‌)లో షేర్ చేస్తూ.. తన ఉపగ్రహం ఈ ఫొటోను తీసినట్లు తెలిపింది.

ఆగ‌స్టు 23వ తేదీన ద‌క్షిణ ద్రువానికి 600 కిలోమీట‌ర్ల దూరంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్ దిగిన‌ట్లు నాసా పేర్కొన్న‌ది. అయితే ఆగ‌స్టు 27వ తేదీన నాసాకు చెందిన ఎల్ఆర్వో ఈ ఫోటోను తీసింది. ల్యాండింగ్ జ‌రిగిన నాలుగు రోజుల త‌ర్వాత ఆ ఫోటో తీశారు. విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను 42 డిగ్రీల కోణంలో ఎల్ఆర్వో కెమెరా ఫోటో తీసినట్లు నాసా వెల్ల‌డించింది. అయితే ఆ ల్యాండ‌ర్ నుంచి వెలుబ‌డిన వాయువులు, అక్క‌డి నేల‌తో ఇంట‌రాక్ట్ కావ‌డం వ‌ల్ల విక్ర‌మ్ చుట్టూ ఆ బ్రైట్ వెలుతురు క‌నిపించిన‌ట్లు నాసా తెలిపింది.


మరోవైపు ఇస్రో కూడా , తాజాగా చంద్రుడి ఉపరితలం త్రీడీ అనాగ్లిఫ్‌ ఫొటోల్ని విడుదల చేసింది. మల్టీ వ్యూ ఇమేజ్‌లను ఒకచోట చేర్చి మూడు కోణాల్లో(త్రీడైమెన్షన్‌) కనిపించేలా ఒక ఫోటో విడుదల చేసింది . విక్రమ్‌ ల్యాండర్‌ ఉన్న ప్రాంతంలో చంద్రుడి ఉపరితలం ఎలా ఉందో ఈ త్రీడీ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజ్ఞాన్‌ రోవర్‌కు అమర్చిన నేవిగేషన్‌ కెమెరాలతో తీసిన ఫొటోలను ప్రత్యేక పద్ధతిలో క్రోడీకరించి ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఎక్స్‌(ట్విట్టర్‌)లో ఇస్రో సందేశాన్ని పోస్ట్‌ చేసింది. ఎరుపు, సియాన్‌ రంగు కళ్లద్దాలను వాడితే త్రీడీ ఇమేజ్‌లను మరింత స్పష్టంగా చూడగలమని ఇస్రో పేర్కొన్నది. సోమవారం ఉదయం విక్రమ్‌ ల్యాండర్‌ నిద్రావస్థలోకి వెళ్లిన తర్వాత త్రీడీ చిత్రాలను ఇస్రో విడుదల చేయటం గమనార్హం. చంద్రయాన్‌-3కి అమర్చిన పేలోడ్‌లు సేకరించిన సమాచారం మొత్తం భూమిపైకి చేరిందని, ప్రస్తుతం అక్కడ రాత్రి కావటం వల్ల పేలోడ్‌లను ఆఫ్‌ చేశామని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story