NASA: అరుణ గ్రహంపై అద్భుతం

NASA: అరుణ గ్రహంపై అద్భుతం
అరుణ గ్రహంపై ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసిన నాసా.... కార్బన్‌ అణువులతో ఆక్సిజన్ ఉత్పత్తి చేసిన రోవర్‌

అరుణ గ్రహంపై ఆక్సిజన్ ఉత్పత్తి కోసం నాసా చేపట్టిన మిషన్‌లో భాగంగా ఇటీవల రోవర్ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. పర్స్ వరెన్స్ రోవర్ లోని పరికరం విజయవంతంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసినట్లు నాసా వెల్లడించింది. 2021లో అంగారకునిపైకి ప్రయోగించిన రోవర్‌లోని మోక్సీ పరికరం కార్బన్ డై ఆక్సైడ్ ను తీసుకుని 122 గ్రాముల ఆక్సిజన్‌ను విడుదల చేసినట్టు పేర్కొంది. ఈ ఆక్సిజన్‌ 98 శాతం స్వచ్ఛంగా ఉన్నట్టు తెలిపింది. ఇది నిర్దేశించిన లక్ష్యం కంటే రెట్టింపు అని నాసా తెలిపింది. అరుణగ్రహంపై ఉన్న వాతావరణంలో ఒక్కొక్క కార్బన్ అణువును తీసుకుని ఆక్సిజన్ విజయవంతంగా ఉత్పత్తి చేసిందని, ఈ పరికరం కార్బన్ డయాక్సైడ్ నుంచి ఆక్సిజన్ ను వేరు చేసే ప్రక్రియలో కీలకపాత్ర పోషించినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో నాసా ఆనందం వ్యక్తం చేసింది. దీంతో భవిష్యత్తులో అంగారకుడిపై వెళ్లే వ్యోమగాములకు ఆక్సిజన్ అందించేందుకు మార్గం సులభమవుతుందని నాసా పేర్కొంది.


అంగారకుడిపై భవిష్యత్తులో మానవ ఆవాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఈ ప్రయోగం దోహదపడతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్ అనే పరికరం ఆక్సిజన్‌ను తయారుచేసి తన మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్లు నాసా ప్రకటించింది. 2021లో పర్సెవరెన్స్ రోవర్ ల్యాండైనప్పటి నుంచి ఈ పరికరం ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది. మార్స్ ఆక్సిజన్ ఇన్-సిటు రిసోర్స్ యుటిలైజేషన్ ఎక్స్‌పెరిమెంట్ పరికరం ఇప్పటి వరకు 122 గ్రాముల ఆక్సిజన్ ఉత్పత్తి చేసినట్లు నాసా తెలిపింది. ఇది నాసా అనుకున్న లక్ష్యం కన్నా రెండింతలు ఎక్కువ. తయారు చేయబడిన ఆక్సిజన్ 98 శాతం స్వచ్ఛంగా, మెరుగ్గా ఉన్నట్లు, ఇది శ్వాస, ఇంధన ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటుందని నాసా ప్రకటించింది.


మార్స్ పై అత్యంత పలుచని వాతావరణం ఉంది. ఇక్కడి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ లోని ప్రతీ అణువు నుంచి ఒక ఆక్సిజన్ అణువును వేరు చేసేలా నాసా ఈ పరికరాన్ని తయారుచేసింది. ఈ విజయం భవిష్యత్తులో అంగారకుడిపై మానవ ఆవాసాలపై ఆశలను మరింత పెంచింది. కొన్ని బిలియన్ ఏళ్ల క్రితం అంగారకుడిపై ద్రవ స్థితిలో నీరు ఉండేదని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story