Voyager 2: అందుకే "వాయేజర్‌" మానవ నిర్మిత అద్భుతం

Voyager 2: అందుకే వాయేజర్‌ మానవ నిర్మిత అద్భుతం
సౌర కుటుంబం ఆవల నుంచి సిగ్నల్స్‌ మళ్లీ వస్తున్నాయన్న నాసా... 46 ఏళ్లుగా నిర్విరామంగా వాయేజర్‌ ప్రయాణం...

భూమి నుంచి వందల కోట్ల కిలోమీటర్ల దూరంలో సౌర కుటుంబం అవతల పయనిస్తున్న అమెరికా వ్యోమనౌక వాయేజర్‌-2‌‍( Voyager 2) నుంచి తిరిగి సంకేతాలు రావడం( Signal To Earth) మొదలైందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(NASA) ప్రకటించింది. రెండు వారాల క్రితం తప్పుడు కమాండ్స్‌( After Blackout) వల్ల వాయేజర్ -2 వ్యోమనౌక యాంటెన్నా భూమి దిశగా కాకుండా వేరే వైపునకు మళ్లింది. దీంతో భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి. నాసాకు ప్రపంచంలో పలు చోట్ల భారీ రేడియో యాంటెన్నాలు ఉన్నాయి. వాటికి తాజాగా వాయేజర్‌-2 నుంచి సంకేతం అందింది. దీంతో.46 ఏళ్ల నాటి ఆ వ్యోమనౌక ఇంకా పనిచేస్తోందని స్పష్టమవుతున్నట్లు నాసా పేర్కొంది. ఇప్పుడు ఆ వ్యోమనౌక యాంటెన్నాను తిరిగి భూమి వైపునకు తిప్పడానికి ప్రయత్నిస్తామని తెలిపింది.


1977లో అమెరికాలో వాయేజర్-1(Voyager 1), వాయేజర్-2 అంతరిక్ష నౌకలు(Launched in 1977) ప్రయోగించింది. అనంత విశ్వంలో దాగి ఉన్న రహస్యాల గుట్టు విప్పడమే లక్ష్యంగా ఈ వాహక నౌకలు అంతరిక్షంలోకి దూసుకెళ్లాయి. వాయేజర్ మిషన్‌ను ప్రాథమికంగా బాహ్య గ్రహాల అధ్యయనం కోసం నాసా చేపట్టింది. గురు, శని, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలను వాటి 48 చంద్రులను, ఆ గ్రహాల చుట్టూ ఉన్న వలయాలను వాయేజర్-1, 2 జంట నౌకలు అన్వేషించాయి.

వాయేజర్-2 నౌక ఇప్పటికీ అంతరిక్షంలో ప్రయాణిస్తూనే ఉంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ సూర్యుడ్ని కూడా దాటిపోయింది. మన సౌర వ్యవస్థ ప్రభావం ఏమాత్రం లేని శూన్యంలో ప్రయాణిస్తోంది. వాయేజర్‌-2 ప్రస్తుతం 19.9 బిలియన్‌ కిలోమీటర్ల((19.9 billion kilometers) దూరంలో ఉంది. అది పంపే సంకేతాలు భూమికి చేరడానికి 18 గంటలకు పైగా సమయం పడుతోంది. భూమి నుంచి ఏదైనా సిగ్నల్ పంపితే, ఈ నౌకను చేరుకోవడానికి ఒకటిన్నర రోజు సమయం పడుతోంది.


వాయేజర్-2 2026 వరకు భేషుగ్గా పనిచేస్తుందని అమెరికా అంతరిక్ష విభాగం ఇంజినీర్లు చెబుతున్నారు. ఇది బ్యాకప్ పవర్ ను ఉపయోగించుకునేలా వారు భూమి నుంచి సిగ్నల్స్ పంపారు. వాయేజర్-2లో ఉన్న పరికరాలను కూడా మరికొన్నాళ్లపాటు పనిచేయించనున్నారు. ఈ నౌకలో ఉన్న శక్తిని పొదుపుగా వాడేందుకు అందులోని కొన్ని పరికరాలను స్విచాఫ్ చేశారు. దాంతో శక్తి ఆదా అవుతుందని, తద్వారా అంతరిక్ష నౌక మరికొన్నాళ్లు సేవలు అందిస్తుందని ఇంజినీర్లు వెల్లడించారు.

1979 జూలై 9న వాయేజర్-2 కూడా గురు గ్రహాన్ని సమీపించింది. 1986 జనవరి 24న యురేనస్‌కు దగ్గరగా... 1989, ఆగస్టు 25న నెప్ట్యూన్‌కు దగ్గరగా వాయేజర్-2 ప్రయాణించింది. వాయేజర్-2లో శక్తి కోసం రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ ను పొందుపరిచారు. ఇది ప్లూటోనియం నుంచి ఉత్పన్నమయ్యే వేడిని శక్తిగా మార్చుతుంది. ప్రస్తుతం ఈ నౌక శూన్యంలో ప్రయాణిస్తూ, అంత దూరం నుంచి డేటాను భూమికి పంపిస్తుండడం వల్ల శక్తిని కోల్పోతోంది.

Tags

Read MoreRead Less
Next Story