Srilanka: గాఢాంధకారంలో శ్రీలంక..

Srilanka: గాఢాంధకారంలో శ్రీలంక..
ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన శ్రీలంక

శ్రీలంక ఆర్థిక సంక్షోభం కట్టుతప్పింది. ధరల పెరుగుదలో ఇప్పటికే అల్లకల్లోలానికి గురవుతున్న ఆ దేశంలో తాజాగా కొత్త సమస్య తలెత్తింది. విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థ కుప్పకూలింది. ఒక్కసారిగా అంధకారం అలముకుంది. దీనితో బ్లాక్ అవుట్‌ను ప్రకటించింది శ్రీలంక ప్రభుత్వం. విద్యుత్ సరఫరా వ్యవస్థను పునరుద్ధరించడానికి తక్షణ చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. కరెంటు సరఫరా స్తంభించిపోవడం వల్ల ఇంటర్నెట్ అందుబాటులో ఉండట్లేదు. ఫలితంగా దీని మీద ఆధారపడిన రంగాలన్నీ అతలాకుతలానికి గురయ్యాయి. పరిశ్రమల కార్యకలాపాలు నిలిచిపోయాయి.

శ్రీలంకలో విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్య ఏర్పడడటంతో మొత్తం దేశ వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీనిపై శ్రీలంకలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వంటి వాటిని పర్యవేక్షించే సిలోన్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు ఒక ప్రకటన చేసింది. అయితే నిలిచిపోయిన విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు సీఈబీ అధికార ప్రతినిధి వెల్లడించారు. కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా అంధకారం నెలకొనడానికి ప్రధాన కారణాలను అన్వేషిస్తోంది శ్రీలంక ప్రభుత్వం. కొట్మలె-బియగామా ట్రాన్స్‌మీషన్ లైన్‌లో తలెత్తిన బ్రేక్ డౌన్ దీనికి కారణమని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ తెలిపింది. దీనితో పాటు ఇతర పవర్ గ్రిడ్‌లల్లో బ్లాక్ అవుట్ సంభవించినట్లు అంచనా వేసింది.


కాట్‌మలే, బియగమా మధ్య మెయిన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్లలో సమస్య ఏర్పడిందని తెలుస్తుంది. ఈ కారణంగానే దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు ఇబ్బంది తలెత్తిందని అధికారులు పేర్కొన్నారు. 2022 లో శ్రీలంకలో ఏర్పడిన తీవ్ర ఆర్థిక సంక్షోభంతో అక్కడి ప్రజల జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. శ్రీలంక వ్యాప్తంగా ఇంధనం, ఆహార పదార్థాలు, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటిపోవడంతో ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

ఈ క్రమంలోనే గత కొన్నిరోజులుగా శ్రీలంకలో విద్యుత్‌ కోతలు సర్వ సాధారణం అయ్యాయి. అయితే ఇప్పటికే శ్రీలంకలో రోజుకు దాదాపు 10 గంటల పాటు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ఇప్పుడు శ్రీలంక వ్యాప్తంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల పరిస్థితి గందరగోళంగా ఉంది. రాత్రి వేళ కరెంట్ సరఫరా లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం, విద్యుత్‌ అధికారులపై ప్రజలు తీవ్రంగా మండి పడుతున్నారు.


గత ఏడాదిగా శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం, ఇంధనం, ఔషధాలు ఇలా అన్నింటికీ కొరత ఏర్పడింది. దేశంలో విద్యుత్ కోతలు కూడా కామన్ అయిపోయాయి. ప్రతి రోజూ 10 గంటల సేపు విద్యుత్ సరఫరాలో కోత విధిస్తున్నారు. ఇప్పుడు విద్యుత్ సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో... ఆసుపత్రుల్లో రోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉంది.


Tags

Read MoreRead Less
Next Story