CHINA: చైనాలో ఆ రెండు నెలల్లో 20 లక్షల మంది మృతి

CHINA: చైనాలో ఆ రెండు నెలల్లో 20 లక్షల మంది మృతి
జీరో కొవిడ్‌ నిబంధనలు సడలించిన సమయంలో కొవిడ్‌ విజృంభణ... వెల్లడించిన అమెరికా అధ్యయనం

కరోనా పుట్టినిల్లు చైనా(CHINA)లో మహమ్మారి(COVID 19) సృష్టించిన విలయం రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జీరో కొవిడ్‌( zero covid policy) విధానమంటూ కఠిన ఆంక్షలు విధించిన చైనా వాటిని సడలించడంతో లక్షల్లో ప్రజలు మరణించినట్లు(deaths) అమెరికా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం మరోసారి చైనాలో కొవిడ్‌ విధ్వంసాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చింది.

చైనాలో కొవిడ్‌ ఆంక్షలు ఎత్తేసిన 2 నెలల్లో 20 లక్షల మంది మరణించినట్లు(20lacs deaths) అమెరికా అధ్యయనం వెల్లడించింది. జీరో కొవిడ్‌ విధానమంటూ కరోనా కట్టడికి డ్రాగన్‌ కఠిన నిబంధనలు అమలు చేసింది. ఈ విధానంపై ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగడంతో చైనా ఆంక్షలను సడలించింది. ఇలా ఆంక్షలు ఎత్తేసిన రెండు నెలల కాలంలో సుమారు 20 లక్షల మంది మరణించినట్లు అమెరికా అధ్యయనం వెల్లడించింది.


ప్రపంచం మొత్తం కొవిడ్‌ ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కూడా చైనా మాత్రం అనేక నెలలపాటు జీరో కొవిడ్‌ పాలసీని కఠినంగా అమలు చేసింది. ఈ విధానంపై చైనావ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు చెలరేగాయి. ఈ నిరసనలతో దిగివచ్చిన జిన్‌పింగ్‌ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో కొవిడ్‌ ఆంక్షలను ఒక్కసారిగా ఎత్తివేసింది. దీంతో ఊహించని స్థాయిలో కొవిడ్‌ మరణాలు సంభవించాయని అమెరికా అధ్యయనం తెలిపింది. జీరో-కొవిడ్‌ విధానం ఎత్తేసిన తర్వాత రెండు నెలల్లోనే చైనాలో సుమారు 20లక్షల అదనపు మరణాలు సంభవించి ఉండొచ్చని అమెరికా అధ్యయనం అంచనా వేసింది.


చైనాలో కొవిడ్‌ మరణాలకు సంబంధించి అక్కడి యూనివర్సిటీలు, స్థానిక సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించిన సమాచారంపై అమెరికా సియాటెల్‌లోని ఫ్రెడ్‌ హట్‌షిన్‌సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ అధ్యయనం జరిపింది. చైనాలోని అన్ని ప్రావిన్సుల్లో డిసెంబర్‌ 2022-జనవరి 2023 మధ్యకాలంలో అన్ని కారణాల వల్ల 18.7లక్షల అదనపు మరణాలు సంభవించాయని గుర్తించింది. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కొవిడ్‌ కారణంగా ఆస్పత్రుల్లో 60వేల మంది మృతి చెందారని, చైనా అధికారికంగా ప్రకటించిన దానికంటే చాలా అధిక స్థాయిలో మృతుల సంఖ్య ఉందని తెలిపింది.

చైనాలో జీరో కొవిడ్‌ విధానం ఎత్తివేతకు సంబంధించి జరిపిన అధ్యయనంలో అనేక అంశాలు వెల్లడయ్యాయని. కొవిడ్‌-19 వ్యాప్తి పౌరుల మరణాలపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇదెంతో ముఖ్యమని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 70లక్షల మంది కొవిడ్‌ మరణాలు సంభవించగా.. చైనాలో 1.21లక్షలు మాత్రమే చోటుచేసుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story