NEPAL CRASH: అనసవర హెలికాఫ్టర్ల ప్రయాణంపై నేపాల్‌ బ్యాన్‌

NEPAL CRASH:  అనసవర హెలికాఫ్టర్ల ప్రయాణంపై నేపాల్‌ బ్యాన్‌
హెలికాఫ్టర్‌ ప్రమాద ఘటన తర్వాత నేపాల్ దిద్దుబాటు చర్యలు... అనవరస హెలికాఫ్టర్ల ప్రయాణంపై నిషేధం... రెండు నెలల పాటు అమలు

ఎవరెస్ట్‌ సమీపాన జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో(chopper crashed) ఆరుగురు మరణించిన తర్వాత నేపాల్ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అవసరం లేని హెలిాకాఫ్టర్ల ప్రయాణాన్ని రెండు నెలల పాటు నిషేధించింది. పర్వత విమానాలు, స్లింగ్ విమానాలు, పూల వర్షం కురిపించే అనవసరమైన ఫ్లైట్స్‌ను(Non-Essential Flights) సెప్టెంబర్ వరకు నిషేధిస్తున్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ నేపాల్ (CAAN) ప్రకటించింది. నేపాల్ ఏవియేషన్ రెగ్యులేటర్ హెలికాప్టర్లు కూడా ఈ పరిధిలోకి వస్తాయని వెల్లడించింది.


నేపాల్‌లో మౌంట్ ఎవరెస్ట్(Mount Everest) సమీపంలో ప్రైవేటు హెలికాఫ్టర్‌ క్రాష్‌ అయిన ఘటనలో పైలెట్ సహా ఐదుగురు మెక్సికన్ దేశస్థులు మరణించారు. హెలికాఫ్టర్‌ను నడుపుతున్న వ్యక్తిని సీనియర్‌ పైలట్‌ చెట్‌ గురుంగ్‌గా గుర్తించారు. ఎవరెస్ట్ సహా ఎత్తైన పర్వత శిఖరాలకు నిలయమైన సోలుకుంభు జిల్లాలోని సుర్కు విమానాశ్రయం నుంచి కాఠ్ మాండూకు ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు వివరించారు. 9ఎన్‌-ఏఎంవీ కాల్‌ సైన్‌తో వ్యవహరించే ఈ హెలికాప్టర్‌ సోలుకుంభులోని సుర్కీ అనే ప్రదేశం నుంచి గాల్లోకి ఎగిరిన 15 నిమిషాల తర్వాత కంట్రోల్‌ స్టేషన్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ఘోరంపై విచారణకు ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేయనుందని ఏవియేషన్‌ అధికారి జ్ఞానేంద్ర భుల్‌ నేపాల్‌ తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హెలికాఫ్టర్‌ ప్రయాణ మార్గాన్ని మార్చుకోవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.


ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌తో సహా దేశంలోని ఎత్తైన శిఖరాలను చూడాలనుకునే పర్యాటకుల కోసం మనంగ్ ఎయిర్... హెలికాప్టర్‌ను నడుపుతోంది. ప్రమాద కారణాలు ఇంకా తెలియరాలేదని.... ఈ ఏడాది జనవరిలో రాజధాని కాఠ్‌మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు వెళ్తోన్న యతి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో మొత్తం 72 మంది మరణించిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story