శ్రీలంకలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం..

శ్రీలంకలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం..
కరోనా పీడకల నుంచి తేరకోక ముందే శ్రీలంకలో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగు చూడటం కలకలం సృష్టిస్తోంది. తాజాగా శ్రీలంక యూనివర్శిటీ తాజా పరిశోధనలో వెల్లడైంది.

కరోనా పీడకల నుంచి తేరకోక ముందే.. శ్రీలంకలో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగు చూడటం కలకలం సృష్టిస్తోంది. తాజాగా శ్రీలంక యూనివర్శిటీ తాజా పరిశోధనలో వెల్లడైంది. లంక దేశంలోని ప్రముఖ జయవర్ధన్ యూనివర్శిటీ ఇమ్యునాలజీ, మాలిక్యులర్ సైన్స్ విభాగాధిపతి నీలికా మాలవీగే.. ఈ కొత్త రకం కరోనా స్ట్రెయిన్ గురించి చెప్పారు. ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్ భారత్, పాకిస్తాన్, ఇండోనేషియా వంటి ఆసియా దేశాలకు వ్యాప్తి చెంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వైరస్ సోకిన యువకుల విషయంలో కూడా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఆక్సిజన్ అందుబాటులో లేకుండా రోగి గాలి పీల్చుకోవడం అసంభవమని స్పష్టంచేశారు.

ఈ కరోనా కొత్త స్ట్రెయిన్.. అత్యంత ప్రమాదకరమైన, శక్తివంతమైన స్ట్రెయిన్ అని.. దాదాపు గంట సేపు గాలిలో ఉండగలదని శ్రీలంక వైద్యాధికారులు చెబుతున్నారు. ఇంక్యుబేషన్ వ్యవధిలో 3 దశలుగా మార్చు చెందుతుందని.. ఒకచోట నుంచి మరో చోటికి వేగంగా వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. గతం వారం శ్రీలంక న్యూ ఇయర్ వేడకుల తరువాత ఎక్కువ మంది యువకులు ఈ కొత్త స్ట్రెయిన్ బారిన పడడంతో వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని కలవరం పడుతున్నారు. రాబోయే 2, 3 వారాల్లో దీని పూర్తిస్థాయి తీవ్రతను పెంచడానికి వీలు కలుగుతుందని శ్రీలంక కోవిడ్ నివారణ మంత్రిత్వశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story