కమెడియన్ ఇచ్చిన టిప్ చూసి వెయిటర్ షాక్.. రూ.9.42 లక్షలు మరి..

కమెడియన్ ఇచ్చిన టిప్ చూసి వెయిటర్ షాక్.. రూ.9.42 లక్షలు మరి..
టిప్ ఇచ్చి వార్తల్లో నిలిచిన ప్రముఖుల సరసన ఈ లేడీ కమెడియన్ కూడా చేరుతుంది.

బిల్లు వేలల్లో వచ్చినా పే చేస్తారు కానీ.. వెయిటర్‌కి ఓ పది, ఇరవై టిప్ ఇవ్వాలంటే అస్సలు చేయి రాదు కొంత మందికి. నిజానికి ఆ టిప్ వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అయితే కొంత మంది ప్రముఖులు, యూట్యూబ్‌లో పాపులర్ అయిన వాళ్లు ఇలా రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు వెయిటర్లకు పెద్ద మొత్తంలో టిప్ రూపంలో ఇస్తుంటారు.

ఆ విధంగా టిప్ ఇచ్చి వార్తల్లో నిలిచిన ప్రముఖుల సరసన ఈ లేడీ కమెడియన్ కూడా చేరుతుంది. తనకు సర్వ్ చేసిన వెయిటర్‌కు ఏకంగా 13వేల డాలర్లు (దాదాపు రూ.9.42 లక్షలు) టిప్‌గా ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేసిన ఘటన అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగింది. అయితే ఆమె ఈ మొత్తాన్ని విరాళాల రూపంలో కలెక్ట్ చేసి వెయిటర్‌కి ఇచ్చింది.

న్యూయార్క్‌లోని కొలంబస్ ఎవెన్యూ వద్ద లిల్లీస్ కాక్‌టైల్ వైన్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఉల్యానా హ్రుచాక్ అనే యువతి వెయిట్రెస్‌గా పని చేస్తోంది. రాబిన్ స్కాల్ అనే లేడీ కమెడియన్ తరచూ ఆ రెస్టారెంట్‌కు వస్తుంటారు. హ్రూచాక్ పనితీరు నచ్చడంతో ఆమె పట్ల స్కాల్‌కు అభిమానం ఏర్పడి ఆమెకు ఏదైనా సాయం చేయాలని భావించారు.

అందుకు తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లను సాయం కోరింది. 1.41 లక్షల మంది ఫాలోవర్లు వెంటనే స్పందించారు. వారికి తోచిన సాయం చేశారు. తొలుత వారి ద్వారా 1000 డాలర్లు సమకూరాయి. మరి కొద్ది నిమిషాల వ్యవధిలోనే 13 వేల డాలర్లు విరాళాల రూపంలో వచ్చాయి. ఆ డబ్బు తీసుకుని వెయిటర్ హ్రూచాక్‌కు అందించింది.

కరోనా మహమ్మారి సమయంలో ఆర్థికంగా చితికి పోయిన తనకు ఈ సాయం చాలా పెద్ద మొత్తమని ఆమె ఆనంద భాష్పాలు కార్చింది. ఇప్పటికీ ఇది తనకు కలలా అనిపిస్తోందని, ఇది నాజీవితంలో మరిచిపోలేని సంఘటన అని వ్యాఖ్యానించింది.

ప్రజలు చాలా సహృదయులు.. సాటి వారి గురించి ఆలోచిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి మేం తోడున్నాం అంటూ భరోసా ఇస్తున్నారు అని వెయిటర్ వ్యాఖ్యానించింది.

Tags

Read MoreRead Less
Next Story