Top

కిమ్ సామ్రాజ్యంలో ఐదో అంతస్తు రహస్యం

దేశంలో ఉన్న 47 అంతస్థుల ఓ హోటల్‌లోని 5వ అంతస్థులో ఏదో రహస్యం దాగి ఉందనేది ఉత్తర కొరియా వాసుల్ని నిద్ర

కిమ్ సామ్రాజ్యంలో ఐదో అంతస్తు రహస్యం
X

ఉత్తర కొరియా ఒక ప్రత్యేకమైన దేశం. ఇతర దేశాలతో సత్ససంబంధాలు నెరపదు.. మిగిలిన దేశాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఉత్తర కొరియా యొక్క అనేక రహస్యాలు బయటి ప్రపంచానికి కాదు కదా ఆ దేశ వాసులకు కూడా తెలియక పోవడం గమనార్హం. దేశంలో ఉన్న 47 అంతస్థుల ఓ హోటల్‌లోని 5వ అంతస్థులో ఏదో రహస్యం దాగి ఉందనేది ఉత్తర కొరియా వాసుల్ని నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది.

అసలేం ఉందో కనుక్కుందామంటే అవకాశమే లేకుండా పోతుంది.. ఆ ఫ్లోర్‌కి వెళ్లడానికి లిప్ట్‌లో బటన్ కూడా ఉండదు. సర్లే ఎక్కి వెళితే ఏం ఉందో చూడొచ్చనుకుంటే అన్ని గదులకు పెద్ద పెద్ద తాళాలు వేసుంటాయి. రాజధాని ప్యోంగ్యాంగ్‌లో ఉన్న యాంగ్కాడో హోటల్ యొక్క ఐదవ అంతస్తులోకి ఎవరికీ వెళ్ళడానికి అనుమతి లేదు. ఈ హోటల్ ఉత్తర కొరియాలోనే అతి పెద్ద హోటల్. అంతే కాకుండా ఇక్కడి ఎత్తైన భవనాల్లో ఒకటి. ఇది టైడాంగ్ నది మధ్యలో ఉన్న యాంగ్టక్ ద్వీపంలో ఉంది.

47 అంతస్తుల యాంగ్కాడో హోటల్‌లో మొత్తం 1000 గదులు ఉన్నాయి. ఇందులో నాలుగు రెస్టారెంట్లు, మసాజ్ పార్లర్ ఉన్నాయి. ఈ హోటల్ ఉత్తర కొరియాలో మొదటి లగ్జరీ హోటల్, గది అద్దె రోజుకు 25 వేల రూపాయలు. దీని నిర్మాణానికి ఆరు సంవత్సరాలు పట్టింది. ఈ భవన నిర్మాణం 1986 సంవత్సరంలో ప్రారంభమై 1992 లో పూర్తయింది. దీనిని ఫ్రాన్స్‌కు చెందిన కంపానియన్ బెర్నార్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మించింది. దీనిని ప్రజల సందర్శనార్థం 1996 లో తెరిచారు. అనేక వ్యాపార సంస్థలు ఇందులో తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

హోటల్ లిఫ్ట్‌లో ఐదవ అంతస్తుకు బటన్ లేదని చెబుతారు. అంటే, ప్రజలు మిగిలిన అంతస్తులలో దేనిలోకైనా వెళ్ళవచ్చు, కానీ ఐదవ అంతస్తుకు వెళ్ళలేరు. ఉత్తర కొరియా ఈ అంతస్థును అత్యంత రహస్యంగా ఉంచింది. అయితే ఓ విదేశీయుడు రహస్యాన్ని ఛేదించాలని ధైర్యం చేసి నడిచి ఐదవ అంతస్తుకు వెళ్లాడని, అది తెలిసిన ప్రభుత్వం అతడిని కఠినంగా శిక్షించిందని స్థానికులు చెబుతారు. అక్కడ శిక్షలు కూడా కఠినంగా ఉంటాయని ప్రపంచ ప్రజలందరికీ తెలిసిన విషయమే.

2016 లో ఒట్టో వార్ంబియర్ అనే అమెరికన్ విద్యార్థి యాంగ్కాడౌ హోటల్ యొక్క ఐదవ అంతస్తుకు వెళ్ళాడు, ఆ తరువాత అతను హోటల్ యొక్క ఐదవ అంతస్తులో ఉన్న ఒక పోస్టర్‌ను తొలగించాడని ఆరోపిస్తూ ఉత్తర కొరియా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఒట్టో వార్ంబియర్‌ను విచారించి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. విచారణ సమయంలో అతన్ని చాలా హింసించాడని చెబుతారు. జైలు శిక్ష అనంతరం విడుదల అయినప్పటికీ, అతడు యుఎస్ తిరిగి వచ్చిన తరువాత కోమాలోకి వెళ్లి జూన్ 2017 లో మరణించాడు.

హోటల్‌లో బస చేసిన మరో అమెరికా పౌరుడు కాల్విన్ సన్ ప్రకారం, యాంగ్కాడో హోటల్ ఐదవ అంతస్తులో చిన్న గదులు బంకర్ లాగా నిర్మించబడ్డాయి, చాలా గదులు లాక్ చేయబడ్డాయి. అమెరిక, జపాన్‌ దేశాలకు వ్యతిరేకంగా ఈ హోటల్ గదుల గోడలపై చిత్రాలు నిర్మించి ఉంటాయి. కొన్ని ఫోటోలు ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌వి కూడా ఉంటాయి. అక్కడ తయారు చేసిన ప్రతి పెయింటింగ్‌లో "అమెరికాలో తయారైనవన్నీ మన శత్రువులు. అమెరికాపై వెయ్యి సార్లు ప్రతీకారం తీర్చుకుంటాం" అని రాసి ఉంటుందని సమాచారం.

Next Story

RELATED STORIES