KIM: కిమ్‌తో రష్యా రక్షణమంత్రి భేటీ

KIM: కిమ్‌తో రష్యా రక్షణమంత్రి భేటీ
ఉత్తరకొరియా నియంతతో షోయిగు భేటీ... కీలక చర్చలతో ప్రాశ్యాత్య దేశాల్లో భయాందోళనలు

వరుస క్షిపణి ప్రయోగాలతో అమెరికా సహా ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న ఉత్తరకొరియా(North Korea) అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో రష్యా రక్షణమంత్రి సెర్గి షోయిగు( Russian Defence Minister Sergey Shoigu) భేటీ అయ్యారు. ఉత్తర కొరియా అధినేత ప్రాంతీయ భద్రత, సైనిక అంశాలపై ఆయనతో చర్చించారు. 1950–53 కొరియా యుద్ధానికి విరామం పలికి 70 వసంతాలు పూర్తిచేసుకుంటున్న వేళ కిమ్‌తో రష్యా రక్షణ మంత్రి సమావేశం కావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పాంగ్‌యాంగ్‌లో సమావేశమైన సెర్గీ, కిమ్‌లు పలు అంశాలపై పరస్పర ఒప్పందానికి వచ్చారు. రష్యా రక్షణ మంత్రి సెర్గీని కిమ్‌ ఆయుధాల ఎగ్జిబిషన్‌కు తీసుకువెళ్లారు. అందులో ఉ.కొరియా ఇటీవల ప్రయోగించిన క్షిపణి వేరియంట్లను దగ్గరుండి చూపించారు.


రష్యా రక్షణమంత్రి Minister Shoigu ) సైనిక బృందంతో ఉత్తరకొరియాలో పర్యటిస్తున్నారు కొరియా యుద్ధం ముగిసిన 70 ఏళ్లు అయిన సందర్భంగా జరిగే వార్షికోత్సవంలో రష్యా ప్రతినిధి బృందం పాల్గొంజి. కొరియా ప్రజల విజయానికి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు రష్యా రక్షణ మంత్రి శుభాకంక్షలు తెలిపారు. ఈ పర్యటన రష్యా-ఉత్తర కొరియా సంబంధాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, రెండు దేశాల మధ్య సహకార అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ఇరు దేశాల ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.


ఉత్తరకొరియాకు రష్యా-చైనా దీర్ఘ కాల మిత్రదేశాలు. 1950లో కొరియా ద్వీపకల్పంలోకి సైనికులను పంపడం ద్వారా చైనా ఉత్తర కొరియా ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమయ్యాయి. కొరియా యుద్ధంలో లక్షా 80 వేల మంది కంటే ఎక్కువ మంది చైనా సైనికులు మరణించారు. అమెరికా దూకుడును నిరోధించడానికి, ఉత్తరకొరియాకు చైనా, రష్యా సహాయం చేస్తున్నాయని పాశ్చాత్య దేశాలు విమర్శిస్తున్నాయి.

యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ కూడా ఉత్తర కొరియాకు మద్దతు ఇచ్చింది. దశాబ్దాలుగా మాస్కో ఉత్తర కొరియాకు బలమైన మిత్రదేశంగా నిలిచింది. ఉత్తర కొరియా-దక్షిణ కొరియా, అమెరికా మిత్రదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనా- రష్యా ప్రతినిధుల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా, దక్షిణ కొరియా... కిమ్‌ రాజ్యంలో క్షిపణి ప్రయోగాలను ఇప్పటికే చాలాసార్లు తీవ్రంగా ఖండించాయి.

అమెరికా, దక్షిణకొరియా అణు సామర్థ్యం గల జలాంతర్గాములు, బాంబర్లను సముద్ర జలాల్లో కూడా మోహరించింది. మరోవైపు అమెరికా సైనికుడు ప్రైవేట్ ట్రావిస్ కింగ్ దక్షిణ కొరియా సరిహద్దు దాటి ఉత్తర కొరియాలోకి అక్రమంగా ప్రవేశించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Tags

Read MoreRead Less
Next Story