Australia: బతికి ఉండగానే పూడ్చేశాడు...

Australia: బతికి ఉండగానే పూడ్చేశాడు...
బ్రేక్ అప్ చెప్పిందని ప్రియురాలిపై పగ, అత్యంత హేయమైన మరణమని అభివర్ణించిన కోర్టు

తన ప్రేమను అంగీకరించలేదని ప్రియురాలిపై కక్ష పెంచుకున్న ఓ యువకుడు ఆమెను అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్ కు చెందిన నర్సింగ్ స్టూడెంట్ జస్మీన్ కౌర్ 2021లో అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. అప్పటికి మిస్సింగ్ కేసును నమోదు చేసిన పోలీసులు దర్యప్తులో విస్తుపోయే నిజాలను వెలికితీశారు.





21ఏళ్ల జస్మీన్ ను మార్చ్ 5, 2021లో ఆమె పని చేసే ఆఫీస్ వద్దే ప్రియుడు తరిక్ జ్యోత్ సింగ్ కిడ్నాప్ చేశాడని పోలీసులు వెల్లడించారు. ఆమె చేతులు కట్టేసి, మెడకు గాయం చేసి డిక్కీలో పడేశాడు. సుమారు 650 కిలోమీటర్లు ప్రయాణించిన తరువాత ఆమెను ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ గుంత తవ్వి జస్మీన్ బతికి ఉండగానే ఆమెను ఆందులో పూడ్చిపెట్టేశాడని పోలీసులు తెలిపారు. తరిక్ జ్యోత్ సింగ్ జస్మీన్ ను చంపిన విధానం కక్షపూరిత స్వభావానికి పరాకాష్టగా కోర్టు అభివర్ణించింది.





హత్యకు గురవుతున్నట్లు జస్మీన్ కు తెలుస్తుండగానే అంతా జరిగి ఉంటుందని అడిలైడ్ నగరంలోని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక మరణం ఇంత దారుణంగా ఉండటం చాలా అరుదని తెలిపింది. గుంతలో పాతిపెడుతున్న సమయంలోనూ ఆమె ప్రాణాలతోనే ఉండే అవకాశం ఉందని. జస్మీన్ మట్టిని పీలుస్తు, నోటిలోకి పోతుండాగా ఉక్కిరిబిక్కిరి అయ్యి చనిపోయిన విధానం ఊచించుకోడానికే ఒళ్లు గగుర్పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.





తొలుత ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆతరువాత తానే పూడ్చిపెట్టానని తరిక్ జ్యోత్ బుకాయించినప్పటికీ, పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. తరిక్ జ్యోత్ తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు గతంలోనే జస్మీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఆమెపై మరింత కక్ష పెంచుకున్న సింగ్, పథకం ప్రకారమే ఆమెను హత్య చేశాడు. ఆమెను అపరించడానికి ముందు కేబుల్ వైర్లు, గ్లవ్స్ వంటి సామాగ్రిని కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.

Tags

Read MoreRead Less
Next Story