Pilot whales : విధి లేక… వేదనతో.. చంపేశారు..

Pilot whales : విధి లేక… వేదనతో.. చంపేశారు..
వృధా అయిపోయిన ప్రయత్నాలు

కుప్పలు తెప్పలుగా ఆస్ట్రేలియా చెయిన్స్‌ బీచ్‌ తీరానికి కొట్టుకొచ్చిన పైలెట్‌ తిమింగలాలను రక్షించేందుకు అధికారులు చాలా కష్ట పడ్డారు. వాటిని తిరిగి సముద్రంలోకి తీసుకెళ్లి కాపాడేందుకు ఏంతో ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చేసేదేం లేక కొన ఊపిరితో తీవ్రమైన బాధ అనుభవిస్తున్న తిమింగలాలకు నొప్పి లేకుండా మరణాన్ని ప్రసాదించారు.

కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియాలోని చెయిన్స్‌ బీచ్‌ తీరానికి ఒక్కసారిగా సుమారు వంద పైలట్‌ తిమింగలాలు కొట్టుకొచ్చాయి. అందులో చాలావరకు నిస్సహాయ స్థితిలో కొన ఊపిరితో ఉండటంతో వాటిని రక్షించటానికి వన్యప్రాణుల సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. తీరానికి కొట్టుకొచ్చిన వాటిలో 52 తిమింగాలు మరణించగా మిగిలిన 45 తిమింగలాలను రక్షించేందుకు అధికారులు, వన్య ప్రాణి సంరక్షణ విభాగ వాలంటీర్లు చాలా ప్రయత్నాలు చేశారు.. వాటిని తిరిగి మళ్లీ సముద్రంలోకి తీసుకెళ్లి వాటిని తిరిగి పంపేందుకు తీవ్రంగా శ్రమించారు. అయినా ఫలితం లేకపోయింది. ఒక్కసారి తిమింగలం ఇసుకలో చిక్కుకొంటే అది మృత్యువు అంచుకు చేరినట్లేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందుకే వాటికి నొప్పిలేకుండా మరణం ప్రసాదించాలని నిర్ణయించారు. విధిలేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు.


వాటిని నీటి లోతుల్లోకి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని అందుకే ఈ బాధాకర నిర్ణయం తీసుకున్నామని ఆస్ట్రేలియా పార్క్స్, వైల్డ్‌లైఫ్ సర్వీస్‌ అధికారి పీటర్ హార్ట్లీ వెల్లడించారు. తిమింగలాలను రక్షించే ప్రయత్నంలో సహకరించిన వందలాది మంది వాలంటీర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

వాస్తవానికి పైలట్ తిమింగలాలు అనేవి చాలా అరుదైన జీవులు. ఇవి రెండు మూడు సంవత్సరాలకొకసారి బిడ్డకు జన్మనిస్తాయి. అలాగే ఆ బిడ్డను పెంచేందుకు తల్లి కొన్ని నెలల పాటు తిండి లేకుండా ఉండాల్సి వస్తుంది. ఇక ఆ బిడ్డ పెరిగి తోడు వెతుక్కునే వరకు దాన్ని కాపాడుకునేందుకు కొన్ని తిమింగాలు మళ్లి గర్భం దాల్చకుండా జాగ్రత్తపడతాయి. అందుకే వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

మంగళవారం సాయంత్రం తూర్పు అల్బానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెయిన్స్ బీచ్​లో ఈ తిమింగలాలు కనిపించాయి. ఒక్కసారిగా తీరానికి కొట్టుకొచ్చిన తిమింగలాలు.. బీచ్​లోని ఇసుకలో చిక్కుకుపోయాయి.అయితే ఒకసారి ఇవి ఇసుకలో చిక్కుకుంటే మాత్రం మళ్ళీ బతకడం అసంభావం. మరోవైపు తిమింగలాల కళేబరాల నుంచి వచ్చే మాంసం వాసన.. షార్క్ చేపలను ఆకర్షిస్తుందన్న కారణంతో అధికారులు ప్రజలను సముద్రం వద్దకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story