Cable car rescue : 14 గంటల తరువాత నేలమీదకి..

Cable car rescue : 14 గంటల తరువాత నేలమీదకి..
6గురు పిల్లలతో 1200 అడుగుల ఎత్తులో ఆగిపోయిన కేబుల్ కారు

పాకిస్థాన్‌లో కేబుల్ కారులో చిక్కుకున్న చిన్నారులు 14 గంటల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. 15 గంటల ప్రయత్నం తర్వాత ఏడుగురు చిన్నారులు, ఓ వ్యక్తిని రక్షించగలిగారు. చిన్నారులందరూ 10 నుంచి 15 ఏళ్లలోపు వారే. ఆహారం, నీళ్లు లేక వారంతా నీరసించిపోయినట్టు అధికారులు చెబుతున్నారు.

ఇక్కడి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ప్రాంతంలో నివసించే ప్రజలు.. ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే ఈ లోయను దాటాల్సి ఉంటుంది. విద్యార్ధులు స్కూలుకు వెళ్లాలంటే ఓ కేబుల్ కారే ఆధారం. కింద లోయ..1200 అడుగుల ఎత్తులో కేబుల్ కారు ఒక సాహసం. అలాగే రోజు స్కూల్ కు వెళుతుంటారు. రోజులాగానే ఆగస్టు 22 న కూడా ఉదయం 7 గంటల సమయంలో ఎనిమిదిమంది కేబుల్ కారులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా కారు కేబుల్ తెగిపోయింది. పిల్లలంతా హాహా కారాలు చేశారు. పాపం భయంతో వణికిపోయారు. ఇక తమ ప్రాణాలు పోతాయని అల్లాడిపోయారు. అందులోని ఓ వ్యక్తి ఫోన్ ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అధికారులు హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతికులం అయిన వాతావరణంతో ఆపరేషన్‌లో చాలా ఆలస్యంగా నడిచింది. హెలికాప్టర్ సహాయంతో పిల్లల్ని బయటికి తీసుకు వచ్చిన దృశ్యాలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఈలోపు పిల్లలకి వాంతులు, నీరసం వంటి సమస్యలు తలెత్తాయి. అయితే వారికి హెలికాప్టర్ ల ద్వారా వాటిని అందించారు. కానీ పిల్లలను హెలికాప్టర్ ద్వారా రక్షించడానికి మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.


కేబుల్ కారులో చిక్కుకున్న వారిలో ఇద్దరు చిన్నారులను రక్షించిన తర్వాత రాత్రి పొద్దుపోయాక సైనిక హెలికాప్టర్ ఆపరేషన్ నిలిపివేసింది. ఆ తర్వాత ఫ్లైడ్‌లైట్లు ఏర్పాటు చేసి కింది నుంచి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. కేబుల్ క్రాసింగ్ నిపుణులు కేబుల్ వెంట ఉన్న చిన్న ఫ్లాట్‌ఫామ్‌లోకి చిన్నారులను చేర్చడం ద్వారా ఒక్కొక్కరినీ కిందికి దించారు. అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్‌ను ఆర్మీ విజయవంతంగా పూర్తిచేసిందని సైన్యం తెలిపింది.

రోజంతా వేలాడుతూ ఉన్న కారులో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపిన చిన్నారులను రక్షించే ప్రయత్నాలు మొత్తానికి చిమ్మ చీకట్లో రాత్రివేళ పూర్తయ్యాయి. పిల్లలను సురక్షితంగా రక్షించినట్టు తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ తెలిపారు. మిలటరీ, రెస్క్యూ విభాగం, జిల్లా అధికారులు, స్థానిక ప్రజలు సంయుక్తంగా చిన్నారులను రక్షించినట్టు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఆర్మీ బృందాలను, అధికారులను ఆయన అభినందించారు.

Tags

Read MoreRead Less
Next Story