Imran Khan : పాక్ పరువు తీసిన ఇమ్రాన్.. గిఫ్ట్‌‌గా వచ్చిన గడియారాన్ని కూడా.. ఛీ..ఛీ..!

Imran Khan :  పాక్ పరువు తీసిన ఇమ్రాన్.. గిఫ్ట్‌‌గా వచ్చిన గడియారాన్ని కూడా.. ఛీ..ఛీ..!
Imran Khan : పాకిస్తాన్ ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. అత్యధిక విదేశీ అప్పులు కలిగిన పది దేశాల జాబితాలో పాకిస్తాన్ చేరినట్లు ప్రపంచ బ్యాంకు ఇటీవల గుర్తించింది.

Imran Khan : పాకిస్తాన్ ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. అత్యధిక విదేశీ అప్పులు కలిగిన పది దేశాల జాబితాలో పాకిస్తాన్ చేరినట్లు ప్రపంచ బ్యాంకు ఇటీవల గుర్తించింది. రెండేళ్ళ పాలనలో ఇమ్రాన్ ఖాన్ పాక్‌‌ని అప్పుల పాలు చేశాడన్న విమర్శలను ప్రతిపక్షాల నుండి ఎదురుకుంటున్నారు. ఇదిలావుండగా ఇప్పుడు ఇమ్రాన్‌ ఖాన్‌పై పలువురు ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇతర దేశాధినేతల నుంచి బహుమతులుగా వచ్చిన ఖరీదైన వస్తువులను ఆయన అమ్ముకుంటున్నారని అక్కడి ప్రతిపక్ష పార్టీలు బుధవారం ఆరోపించాయి. ఓ గల్ఫ్‌ దేశ యువరాజు ఇచ్చిన ఖరీదైన గడియారాన్ని తన సన్నిహితుడు ద్వారా దుబాయ్‌‌లో దానిని విక్రయించి సుమారు రూ.7.4 కోట్లు ఇమ్రాన్ తన జేబులో వేసుకున్నారని ఆరోపించాయి. ఇమ్రాన్ ఇలా చేసి దేశ పరువు తీస్తున్నాడని ఆరోపించాయి.

పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) పార్టీ ఉపాధ్యక్షురాలు మర్యమ్‌ నవాజ్, విపక్ష కూటమి- పాకిస్థాన్‌ డెమోక్రటిక్‌ మూవ్‌మెంట్‌ (పీడీఎం) అధ్యక్షుడు మౌలానా ఫజ్లుర్‌ రెహ్మాన్‌ తదితరులు ఇమ్రాన్‌పై ఈ ఆరోపణలు చేసిన వారిలో ఉన్నారు. దేశాధినేతలు లేదా రాష్ట్రల సందర్శన సమయంలో రాజ్యాంగ పదవులను కలిగి ఉన్న వారి మధ్య బహుమతులు అనేవి ఇచ్చిపుచ్చుకుంటారు.

గిఫ్ట్ డిపాజిటరీ నిబంధనల ప్రకారం వీటిని వేలంలో విక్రయించకపోతే ఈ బహుమతులు రాష్ట్ర, దేశ ఆస్తిగా ఉంటాయి. రూ. 10,000 కంటే తక్కువ మార్కెట్ విలువ కలిగిన బహుమతులను ఏమీ చెల్లించకుండానే అధికారులు తమవద్దే వాటిని ఉంచుకోవాడానికి వీలుంటుంది.

Tags

Read MoreRead Less
Next Story