Nawaz Sharif : ఇమ్రాన్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ ప్రధాని

Nawaz Sharif : పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ దేశ మాజీప్రధాని నవాజ్ షరీఫ్.. ప్రస్తుతం షరీఫ్ బ్రిటన్ రాజధాని లండన్‌లో చికిత్స పొందుతున్నారు. గురువారం లాహోర్‌లో జరిగిన పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) సమావేశంలో ఆయన ఆన్‌లైన్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ పై ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌లో ఇమ్రాన్‌ఖాన్‌ను 'తోలుబొమ్మ' అని పిలుస్తారని, అమెరికాలో ఇమ్రాన్ ఖాన్ కంటే అక్కడి మేయర్‌కే ఎక్కువ అధికారాలు ఉంటాయన్నారు. ఎందుకంటే ఆయన ఎలా అధికారంలోకి వచ్చారో ప్రపంచానికి తెలుసునని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రజల ఓట్లతో కాకుండా సైనిక వ్యవస్థ సహాయంతో అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ తాను ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌కి దగ్గరకు సహాయం కోసం వెళ్లడం కంటే ఆత్మహత్య చేసుకోవడానికే ఇష్టపడతానని చెబుతుండేవాడు.
అయితే ఆయన ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటాడోనని వేచి చూస్తున్నట్లుగా షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా పాకిస్థాన్‌లో రెండు అవినీతి కేసుల్లో దోషిగా తేలిన 71 ఏళ్ల షరీఫ్.. నవంబర్ 2019 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు. వైద్య చికిత్స కోసం నాలుగు వారాల పాటు విదేశాలకు వెళ్లేందుకు లాహోర్ హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత నవంబర్ 2019 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com