పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా పాజిటివ్‌.. !

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా పాజిటివ్‌.. !
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు ఆ దేశ వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు ఆ దేశ వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఖాన్‌ స్వీయ నిర్బంధంలో ఉన్నట్టుగా పేర్కొంది. కాగా ఇమ్రాన్‌ ఖాన్‌ రెండు రోజుల కిందట చైనా అభివృద్ధి చేసిన కరోనా టీకా వేయించుకున్నారు. అనంతరం ఆయనకి కరోనా పాజిటివ్ రావడం గమనార్హం.. ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు, పాకిస్తాన్ దేశంలో కూడా రోజువారీ కోవిడ్ -19 కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

ఇప్పటివరకు ఆ దేశంలో మొత్తం 6,23,135 కేసులు నమోదు కాగా.. మృతుల సంఖ్య 13,799కి చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడిన ప్రాంతాల్లో పాకిస్తాన్ గురువారం లాక్‌డౌన్ విధించింది. అన్ని మార్కెట్లు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు మరియు రెస్టారెంట్లు మూసివేయలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా కిరాణా దుకాణాలు, ఆసుపత్రులు, ఫార్మసీలకి మినహాయింపులు ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story