Pakistan: జాతీయ అసెంబ్లీ సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అసీఫా భుట్టో

Pakistan: జాతీయ అసెంబ్లీ సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన అసీఫా భుట్టో
దేశ ప్రథమ మహిళగా కూడా అసీఫా భుట్టో

పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యునిగా అసీఫా భుట్టో-జర్దారీ శుక్రవారం NA-207 షహీద్ బెనజీరాబాద్ నుండి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. మార్చి 17న ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అసీఫా భుట్టో-జర్దారీ నామినేషన్ దాఖలు చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో షహీద్ బెనజీరాబాద్ నుంచి అసీఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం పరిశీలన ప్రక్రియ అనంతరం రిటర్నింగ్ అధికారి (RO) ఆమె అభ్యర్థిత్వాన్ని ఆమోదించారు.నియోజకవర్గం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు తనకు కృతజ్ఞతలు, గౌరవం అని ఆమె అన్నారు.ఎన్నికైన అసీఫా భుట్టో-జర్దారీకి సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లంజర్ అభినందనలు తెలిపారు.

జర్దారీ భార్య మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో. ఆమె 2007లో హత్యకు గురయ్యారు. అప్పటి నుంచి జర్దారీ ఎవరినీ వివాహం చేసుకోలేదు. అందువల్ల తన కుమార్తె ఆసిఫాకు దేశ 'ప్రథమ మహిళ' హోదా కల్పించాలని ఆయన నిర్ణయించారు.

ఈ విషయాన్ని జర్దారీ పెద్ద కుమార్తె భక్తావర్ భుట్టో తన సోషల్ మీడియా పోస్టు ద్వారా నిర్ధారించారు. ప్రతికూల పరిస్థితుల నుంచి దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు జర్దారీకి ప్రతి విషయంలోనూ దేశ 'ప్రథమ మహిళ' ఆసిఫా వెన్నంటే నిలిచింది అని భక్తావర్ పోస్టు చేశారు.

రాజకీయాల్లో చురుకుగా

రాజకీయాల్లోకి ఆసిఫా 2020 నుంచి చురుకుగా ఉంటున్నారు. ఆత్మాహుతి దాడిలో మరణించి పాకిస్థాన్‌ తొలి మహిళా ప్రధాని బెనజీర్‌ భుట్టో కుమార్తె ఆసిఫా. భుట్టో-జర్దారీ కుటుంబంలో ఆసీఫా అంచెలంచెలుగా ఎదిగారు. అధ్యక్షుడు జర్దారీకి కొడుకు బిలావల్, కుమార్తెలు భక్తవర్, అసీఫా ఉన్నారు. ఆసీఫా రాజకీయాల వైపు మొగ్గు చూపింది.

పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా కొంతకాలం ఆసిఫా సోదరుడు బిలావల్ పనిచేశారు. అతడి కంటే తన సోదరి భక్తవర్ కంటే ఆసిఫా భుట్టో తన తండ్రితో ఎక్కువగా కనపడతారు. రాజకీయ ప్రసంగాలు, ర్యాలీలలో చురుకుగా పాల్గొన్నారు, పీపీపీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు.

పాకిస్థాన్‌లో పోలియో నిర్మూలన అంబాసిడర్‌గానూ ఆసిఫా ఉన్నారు. 2022లో ఖనేవాల్‌లో పీపీపీ ఊరేగింపు సందర్భంగా ఆసిఫా తన సోదరుడు బిలావల్‌తో కలిసి వెళుతుండగా మీడియా డ్రోన్ ఢీకొట్టింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే చికిత్స తీసుకుని కోలుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story