Pakistan: చుక్కల్ని అంటుతున్న పెట్రోల్ ధరల

Pakistan: చుక్కల్ని అంటుతున్న పెట్రోల్ ధరల
లీటర్ రూ. 290 పైమాటే

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ మరోసారి పెట్రోల్ ధరల్ని పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలు నిత్యావసరాలు, గ్యాస్, కరెంట్ ధరలు పెరగడంతో అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడి ప్రజలపై భారం మోపేందుకు షహబాజ్ సర్కార్ సిద్ధమైంది. వచ్చే రెండు వారాల్లో పాకిస్తాన్ పెట్రోల్ ధరల్ని పెంచనున్నట్లు అక్కడి స్థానిక మీడియా నివేదించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగదల కారణంగా పెట్రోల్ ధర లీటర్‌కి రూ. 10(పాకిస్తానీ రూపాయలు) మేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయంగా ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. పెంచుతున్న ధరలతో పాక్ లో లీటరు పెట్రోలు ధర రూ.289.69కి చేరనుంది. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రజలు పెట్రోలు ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరగడం వల్ల స్థానికంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని ఓ అధికారి తెలిపారు. మార్చి మొదటి పక్షంలో బ్యారెల్ ధర 90 డాలర్లు ఉంటే ఇది ఇప్పుడు 95 డాలర్లకు పెరిగింది.

ఇక డీజిల్ ధరలపై రూ.1.30 తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. లైట్ డీజిల్ ధర రూ. 0.45 పెరిగి రూ. 168.18 నుంచి రూ. 168.63కి పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం 285.86 పాకిస్థాన్ రూపాయలు ఉన్న లీటర్ డీజిల్ ధర రూ.284.26కి చేరనుంది. కిరోసిన్ ధర లీటరుకు రూ.188.66 నుంచి రూ.188.49కు తగ్గింది. అంటే లీటరుకు రూ.0.17 తగ్గుదల నమోదైంది. లైట్ డీజిల్ ధర రూ. 0.45 పెరిగి రూ. 168.18 నుంచి రూ. 168.63కి పెరిగే అవకాశం ఉంది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు దాని నుంచి బయటపడే పరిస్థితులు కనపడడం లేదు. దీంతో పాక్ సర్కారు ధరలను పెంచుతూ, ప్రజలపై మరింత భారం మోపుతూ వెళుతోంది.

Tags

Read MoreRead Less
Next Story