Top

ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు చాల్లేదు.. నాలుగోపెళ్లికి రెడీ అయిన నవమన్మధుడు

చీపుర కట్ట తిరగేయాల్సింది పోయి ముగ్గురు భార్యలు నాలుగో ఆవిడను వెతికే పనిలో పడ్డారు.

ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు చాల్లేదు.. నాలుగోపెళ్లికి రెడీ అయిన నవమన్మధుడు
X

పెళ్లి చేసుకోవడానికి నాకో అందమైన అమ్మాయికి కావాలి.. నా క్వాలిఫికేషన్ వయసు 20.. ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలు.. మీరు చదివింది నిజంగా నిజం.. ఈ రోజుల్లో ఒక అమ్మాయి దొరకడమే కష్టమనుకుంటే ఈ మహానుభావుడు వేరే పనేం లేదన్నట్లు వరుస పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కనేస్తున్నాడు.. పైగా ముగ్గురు భార్యలతో ముచ్చటగా ఒకే ఇంట్లో కాపురం పెట్టాడు.. నాలుగో పెళ్లికి సై అంటూ ఆ ముగ్గురు భార్యలు ఆయనకు వత్తాసు పలుకుతున్నారు. మరి వీళ్లందర్నీ పోషించడానికి మనోడికి జీతం కంటే గీతం ఎక్కువొస్తున్నట్లుంది.. అందుకే పెళ్లిళ్లు చేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు.

పాకిస్తాన్‌ సైల్‌కోట్‌లో నివసిస్తున్న 20 ఏళ్ల అద్నన్‌ 16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ల తరువాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. గత ఏడాది మూడో పెళ్లి చేసుకున్నాడు.. తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. వాళ్లాయన అన్ని పెళ్లిళ్లు చేసుకుంటుంటే చీపుర కట్ట తిరగేయాల్సింది పోయి ముగ్గురు భార్యలు నాలుగో ఆవిడను వెతికే పనిలో పడ్డారు.

ముగ్గురిలో ఎవరితో ఎక్కువ సేపు ఉన్నా ఎలాంటి ఫిర్యాదులు చేయకుండా మంచి అండర్ స్టాండింగ్‌తో మసలుకుంటున్నారు. అతను ఎవరి వద్దకు వెళ్లినా తమకు ఏ అభ్యంతరం లేదని చెబుతున్నారు. అద్నన్ కుటుంబ పోషణ నిమిత్తం నెలకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలు ఖర్చవుతాయని చెబుతున్నాడు. పెళ్లి చేసుకుంటున్న ప్రతిసారి తన ఆర్థిక పరిస్థితి మెరుగవుతోందని వరుస పెళ్లిళ్లు చేసుకోవడానికి అదే అసలు కారణమని అంటున్నాడు. ఇక తన ముగ్గురు భార్యల పేర్లు సుంబాల్, శబానా, షహీదా.. అలాగే వచ్చే నాలుగో భార్య పేరు కూడా 'ఎస్' అక్షరంతో మొదలైతే బావుంటుందని.. అంతకంటే తానేమీ ఆశించట్లేదని ఎంతో బుద్దిగా చెబుతున్నాడు.

Next Story

RELATED STORIES