Pm Modi : ఫ్రాన్స్ పర్యటనలో భారత ప్రధాని

Pm Modi : ఫ్రాన్స్  పర్యటనలో భారత ప్రధాని
రెడ్ కార్పెట్‌ స్వాగతం, ప్రముఖులతో సమావేశలు

ముఖ్యఅతిథిగా ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ ఉన్నత స్థాయి నాయకులతో విడివిడిగా భేటీ అయ్యారు. మెుదట ఫ్రాన్స్‌ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లర్చర్‌తో సమావేశమైన మోదీ ఇరు దేశాలకు ప్రయోజనం చేకూర్చే అంశాలపై చర్చించారు.

అనంతరం ఫ్రాన్స్‌ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. వాణిజ్యం, ఇంధనం, పర్యావరణం, విద్య, ఆర్థిక, రైల్వేలు, డిజిటల్ మౌలిక వసతులు వంటి వివిధ రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వీరు చర్చించినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. పారిస్‌ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించాక హోటల్‌కు చేరుకున్న మోదీ అక్కడే వేచిఉన్న పిల్లలు, ప్రవాస భారతీయులతో సంభాషించారు.


ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రవాస భారతీయులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. భారత్‌లో అత్యంత విజయవంతమైన డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ UPIను.. ఇక ఫ్రాన్స్‌లో ఉపయోగించుకోవచ్చని మోదీ ప్రకటించారు. భారత్‌- ఫ్రాన్స్ UPIని ఉపయోగించడానికి అంగీకరించాయని ఆయన తెలిపారు. త్వరలో ఈఫిల్‌ టవర్ నుంచి ఫ్రాన్స్‌లో యూపీఐ సేవలను ప్రారంభిస్తామని ప్రకటించారు. అంటే ఫ్రాన్స్‌లో పర్యటించే భారతీయ పర్యాటకులు ఇక రూపాయాల్లోనూ డిజిటల్‌ పేమెంట్స్‌ చేయవచ్చు.

రానున్న 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ కృషి చేస్తోందని, ఇందులో ప్రవాస భారతీయుల పాత్ర చాలా కీలకమన్నారు . భారతీయులను రక్షించడానికి మేము ఎల్లప్పుడూ ముందుకు వస్తామన్న ఆయన భారత్‌లో ఉన్న పౌరులు ఎంత ముఖ్యమో, విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా అంతే ముఖ్యం అన్నారు. ప్రవాస భారతీయలను భారత రాయబారులుగా అభివర్ణించిన మోదీ. భారత్‌లో పర్యాటక రంగం పురోగతికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో భారత్‌లో చంద్రయాన్‌ 3ను ప్రయోగించేందుకు రివర్స్‌ కౌంటింగ్‌ ప్రతిధ్వని తనకు వినిపిస్తోంది అన్నారు మోదీ. వెంటనే ప్రభాత భారతీయులంతా చంద్రయాన్ చంద్రయాన్ అంటూ అరిచారు. మోదీ మరింత ఆనందంగా స్పందించారు. భారతీయులు ఎక్కడ ఉన్నా వారి గుండె భారత్‌ కోసమే కొట్టుకుంటుందని, స్పేస్‌ గురించి మాట్లాడుతున్నప్పుడు చంద్రయాన్‌, చంద్రయాన్‌ అని అరుస్తున్నారు అంటే మీరు ఇక్కడ ఉన్నా కానీ మీ మనసు మాత్రం చంద్రయాన్ మీద ఉంది. అన్న మాటకు అక్కడి భారతీయులు మురిసిపోయారు.


సమావేశం అనంతరం, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ ఇచ్చే విందుకు మోదీ హాజరయ్యారు. విందు కోసం పారిస్‌లోని ఎలీసీ ప్యాలెస్‌కు చేరుకున్న ప్రధానికి, మేక్రాన్, ప్రథమ మహిళ బ్రిగిట్టే మేక్రాన్‌లు స్వాగతం పలికారు.

Tags

Read MoreRead Less
Next Story