Abu Dhabi : మోదీకి ఘన స్వాగతం పలికిన కింగ్ షేక్ ఖలీద్

Abu Dhabi : మోదీకి ఘన స్వాగతం పలికిన కింగ్ షేక్ ఖలీద్
ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని అబుదాబిలో అడుగుపెట్టిన మోదీ

మోదీకి ఘన స్వాగతం

పలికిన కింగ్ షేక్ ఖలీద్ప్రధానమంత్రి నరేంద్రమోదీ....2రోజుల పర్యటనలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ -UAE చేరుకున్నారు. అబుదాబి విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘనస్వాగతం లభించింది. ఈ పర్యటన సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. తన స్నేహితుడు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ తో సమావేశం కోసం ఎదురుచూస్తున్నట్లు, పర్యటనకు ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, ఆహారభద్రత, శాస్త్రసాంకేతికత, విద్య, ఫిన్ టెక్ , రక్షణ, భద్రత తదితర రంగాల్లో సంబంధాలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.


ఈ పర్యటన సందర్భంగా ఇంధనం, ఆహారభద్రత, రక్షణ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరిన తర్వాత ద్వైపాక్షిక సంబంధాల్లో.... పురోగతిని ప్రధాని మోదీ ఈ సందర్బంగా సమీక్షించనున్నారు. మోదీ ప్రధాని అయిన తరువాత గల్ఫ్ దేశాలతో సంబంధాలపై చాలా కసరత్తు చేశారనే చెప్పచు. గత ఎనిమిదేళ్లలో మోదీ నాలుగుసార్లు యూఏఈ పర్యటనకు వెళ్లారు. 2015 ఆగస్టులో తొలిసారి సందర్శించారు.

1981లో ఇందిరా గాంధీ యూఏఈ పర్యటన తరువాత, ఏ భారత ప్రధానీ అక్కడకు వెళ్లలేదు. 34 ఏళ్ల తరువాత 2015లో మోదీ యూఏఈలో పర్యటించారు. ఇప్పటి వరకు 4 సార్లు పర్యటించగా ఇది ఐదవ పర్యటన.

ఇక 2022 జూన్ 28న ప్రధాని మోదీ అబుదాబి విమానాశ్రయంలో దిగినప్పుడు, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు స్వాగతం పలికేందుకు రిసెప్షన్ వద్ద వేచి ఉన్నారు. ఇది అక్కడి ప్రోటోకాల్‌కు విరుద్ధం. కానీ, మోదీ విషయంలో అల్ నహ్యాన్ దానిని ఉల్లంఘించారు.

దీని గురించి ఇరు దేశాలలోనే కాదు పాకిస్తాన్‌లో కూడా చాలా చర్చ జరిగింది. గల్ఫ్ దేశాలు భారత్‌కు ఇస్తున్న ఈ ప్రత్యేక గౌరవం పాక్ ని అప్పట్లోనే కలవరపెట్టింది. అటు మోదీ కూడా షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. 2017లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ప్రభుత్వం మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. అప్పుటికి మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ యూఏఈ అధ్యక్షుడు కాలేదు. అబుదాబి క్రౌన్ ప్రిన్స్‌గా ఉన్నారు. భారత్‌లో గణతంత్ర వేడుకలకు ఒక దేశ ప్రధాని లేదా అధ్యక్షుడి హోదాలో ఉన్నవారినే ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఆనవాయితీ. కానీ, 2017లో రిపబ్లిక్ డేకి అల్ నహ్యాన్ ముఖ్య అతిథిగా వచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story