Australia: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై దాడి

Australia: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థిపై దాడి
విదేశాల్లో పెరుగుతున్న ఖలిస్థానీ మద్దతుదారుల హింస

ఆస్ట్రేలియాలో దారుణం జరిగింది. ఖలిస్థానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ఓ భారతీయ విద్యార్థిపై తీవ్రమైన దాడి జరిగింది. అతడిని ఖలిస్థానీ మద్దతుదారులు ఇనుప రాడ్లతో కొట్టి గాయపరిచారు. ఈ సంఘటన అక్కడి భారతీయ విద్యార్థులలో కలకలం సృష్టించింది. కారులో వెళుతున్న ఓ భారతీయ విద్యార్థిని బయటకు లాగి కొట్టారు కొంతమంది ఖలిస్థానీ మద్దతుదారులు.

ఖలిస్థానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకించే ఓ భారతీయ విద్యార్థిని ఇనుప రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. సిడ్నీ నగరంలోని మెర్రీల్యాండ్స్‌లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఈ ఘటన జరిగింది. బాధితుడు తన వాహనంలో బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అయిదుగురు ఖలిస్థానీవాదులు యువకుడిని చుట్టుముట్టారు. కారులో ఉన్న అతడి దవడపై ఇనుపరాడ్డుతో పొడిచారు. ఈలోపు మరికొందరు వాహనం తలుపు తెరిచి విద్యార్థిని బయటకు లాగి కింద పడేసి ఇనుప రాడ్లతో ఇష్టారీతిన దాడి చేశారు.



దాడి జరుగుతుందగా ఇద్దరు ప్రత్యేకంగా ఈ ఘటనను వీడియో తీశారని, దాడికి పాల్పడుతున్న సేపు వారు ఖలిస్తాన్‌ జిందాబాద్‌ అని నినదించారని బాధితుడు చెబుతున్నాడు. ఖలిస్థానీ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తే ఇలాగే జరుగుతుందని వార్నింగ్ ఇచ్చారని, ఈ ఘటనను ఓ గుణపాఠంగా భావించాలని యువకుడికి సూచించినట్టుగా తెలుస్తోంది. అతడి తీరు మారకపోతే ఇలాంటి గుణపాఠాలు మరిన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. యువకుడికి తల, చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలు కావడంతో అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ సంఘటనను మెర్రీల్యాండ్స్ పార్లమెంటు సభ్యులు ఖండించారు. స్థానిక సమాజంలో ఎలాంటి తీవ్రవాదం లేదా హింసకు చోటు లేదనీ, ఈ సంఘటనకు సంబంధించి న సంబంధిత అధికారులను సంప్రదింస్థానన్నారు. ఈ ఏడాది జనవరిలో మెల్‌బోర్న్‌లో ఖలిస్తానీ కార్యకర్తలు, భారత అనుకూల ప్రదర్శనకారుల మధ్య రెండు వేర్వేరు ఘర్షణలు జరిగాయి. ఖలిస్తానీ వేర్పాటువాదుల భారత వ్యతిరేక కార్యకలాపాలను, దేశంలోని హిందూ దేవాలయాలపై తరచూ దాడులను అరికట్టాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

ఆస్ట్రేలియా మాత్రమే కాదు అమెరికా, కెనడా, బ్రిటన్‌తోపాటు చాలా దేశాల్లోని సిక్కులు ఖలిస్తాన్ కోసం డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ దేశాల్లోని సంస్థలకు భారత్‌లోని పంజాబ్‌లో అంత ప్రజాదరణ లేదు.

Tags

Read MoreRead Less
Next Story