POLAND: సరిహద్దుకు పదివేలమంది సైనికులు

POLAND: సరిహద్దుకు పదివేలమంది సైనికులు
బెలారస్‌లో తిష్టవేసిన వాగ్నర్‌ గ్రూప్‌ దళాలు... అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న శరణార్థులు...

ఓవైపు బెలారస్‌(Belarus)లో తిష్ట వేసిన వాగ్నర్‌ గ్రూప్ దళాలు... మరోవైపు దేశంలోకి చొరబడుతున్న వేలాదిమంది శరణార్దులు.. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు పోలాండ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. బెలారస్‌ సరిహద్దు(border with Belarus)కు 10వేల మంది సైనికులను తరలించాలని‍(Poland plans to deploy 10,000 troops) పోలండ్‌ (Poland) రక్షణ శాఖ వెల్లడించింది. ఇటీవల రష్యాతో (Russia) సంబంధమున్న కిరాయి సైన్యం వాగ్నర్‌ గ్రూప్‌ బెలారస్‌లో మకాం వేసింది. శరణార్థులు ఆ దేశ సరిహద్దు గుండా పోలండ్‌లో ప్రవేశించడానికి యత్నిస్తున్నట్లు తెలిసిన నేపథ్యంలో పోలాండ్‌ ఈ కీలక నిర్ణయం తీసుకుందని రక్షణశాఖ మంత్రి(Poland's Defence Minister ) మారియో బ్లాష్‌(Defence Minister Mariusz Blaszczak ) జాక్‌ తెలిపారు.


సరిహద్దుకు 10 వేల మంది సైనికులను పంపిస్తున్నామని బ్లాష్‌ జాక్‌ తెలిపారు. పోలీసులు, సరిహద్దు గార్డు అధికారులకు కొత్తగా వెళ్లే సిబ్బంది సాయంగా ఉంటారని ఆయన తెలిపారు. రోజు 2 వేల మంది సైనికులను సరిహద్దు భద్రతకు చేరవేయాలని పోలాండ్‌ భావిస్తోంది. మొత్తం పదివేలమందిని సరిహద్దుల్లో మోహరిస్తామని, అత్యవసర పరిస్థితిని వీరు సమీక్షిస్తారని పోలాండ్‌ రక్షణమంత్రి తెలిపారు. గత రెండు సంవత్సరాలుగా పలువురు శరణార్థులు బెలారస్‌ నుంచి పోలండ్‌లోకి ప్రవేశించడానికి యత్నిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.


ఈ కుట్ర వెనుక బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో ఉన్నారని పోలండ్‌, ఇతర నాటో దేశాలు ఆరోపిస్తున్నాయి. లుకషెంకో రష్యాకు కీలక మిత్రుడు. పశ్చిమంలో అస్థిరతను సృష్టించే లక్ష్యంతో వలసదారులకు మార్గం తెరిచి ‘హైబ్రిడ్‌ వార్‌ఫేర్‌’కు పాల్పడుతున్నారని ఆ దేశాలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుతం బెలారస్‌లోనే మకాం వేసిన వాగ్నర్‌ గ్రూప్‌ గురించి కూడా పోలండ్ ఆందోళన చెందుతోంది.


మరోవైపు ఏడాదిన్నరగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో వేలాదిమంది అమాయకులు కూడా బలవుతున్నారు. రష్యా(Russia) చేస్తున్న దండయాత్రలో ఇప్పటివరకూ తమ వైపు 10 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్‌ ప్రభుత్వం(Ukraine ) ప్రకటించింది. వీరిలో 499 మంది పిల్లలు కూడా ఉన్నట్లు ఉక్రెయిన్‌ ప్రాసిక్యూటర్‌ జనరల్‌ కార్యాలయంలో యుద్ధ నేరాల విభాగం అధికారి(Ukraine’s War Crimes Department) యూరియ్‌ బెల్‌సోవ్‌ (Yuriy Belousov) తెలిపారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ యుద్ధంలో భాగంగా రష్యా సేనలు ఉక్రెయిన్‌లో చేసిన 98 వేల యుద్ధ నేరాలను తమ విభాగం నమోదు చేసిందని యూరియ్‌ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story