OBAMA VS INDIA: ఒబామా ఓ ప్రైవేట్‌ వ్యక్తి: అమెరికా

OBAMA VS INDIA: ఒబామా ఓ ప్రైవేట్‌ వ్యక్తి: అమెరికా
బరాక్‌ ఒబామా ఓ ప్రైవేట్‌ వ్యక్తన్న అమెరికా అధ్యక్ష భవనం... వైట్‌హౌస్‌తో ఒబామాకు సమన్వయం లేదని స్పష్టీకరణ...

భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. భారత్‌లో దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండడంతో అగ్రరాజ్యం స్పందించింది. బరాక్ ఒబామా పట్ల సమున్నత గౌరవం ఉన్నప్పటికీ, ఆయన ఓ ప్రైవేటు వ్యక్తి అని... వైట్‌హౌస్‌తో ఆయనకు సమన్వయం లేదని ను బైడెన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్‌లో మైనారిటీల రక్షణ గురించి ఒబామా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సున్నితంగా ఖండించింది.

ప్రధాని మోడీతో ప్రతి అంశాన్ని బైడెన్ ప్రస్తావించారని... ఈ సంభాషణ చాలా గౌరవప్రదంగా, హుందాగా జరిగిందని వైట్‌హౌస్‌ సీనియర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌ తెలిపారు. ఒబామా పట్ల తమకు సమున్నత గౌరవం ఉందనీ.. అయినా ఆయన ప్రైవేటు వ్యక్తని, ఆయనకు వైట్‌హౌస్‌కు మధ్య అసలు సమన్వయం లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. జూన్ 22న అగ్రరాజ్య అధినేత బైడెన్ దంపతులతో సమావేశమయ్యారు. అదే రోజు ఓ టీవీ చానల్‌తో మాట్లాడిన బరాక్ ఒబామా.. ఇండియాలో ముస్లిం మైనారిటీల రక్షణ గురించి మోదీతో బైడెన్ మాట్లాడాలన్నారు. తాను మోదీతో మాట్లాడి ఉంటే... తన వాదనలో కొంత భాగం భారత దేశంలో మైనారిటీల హక్కుల గురించే ఉంటుందన్నారు. భారత్‌లో మైనారిటీల హక్కులను మోడీ కాపాడలేకపోతే భారత్‌ విడిపోయే అవకాశం బలంగా ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

టుంది. అంతర్గత ఘర్షణలు ముస్లిం ఇండియా... హిందూ ఇండియా ప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. ఒబామా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు భారత్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఒబామా వ్యాఖ్యలపై మండిపడ్డారు. ముస్లింలు అధికంగా ఉన్న ఆరు దేశాలపై ఒబామా నేతృత్వంలోని అమెరికా బాంబులు కురిపించిందని నిర్మల సీతారామన్ గుర్తు చేశారు. భారత దేశంలోనే చాలా మంది హుస్సేన్ ఒబామాలు ఉన్నారని, అలాంటివారిపై అస్సాం పోలీసులు చర్యలు తీసుకుంటారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ సబ్రినా సిద్ధికీ ప్రధాని మోదీని ప్రశ్నించిన తీరుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వివాదం గురించి అడిగిన ప్రశ్నకు వైట్ హౌస్ అధికారి స్పందించారు. పత్రికా స్వేచ్ఛ చాలా ముఖ్యమని తాము విశ్వసిస్తున్నామన్నారు. ఆన్‌లైన్ వేధింపులకు తాము మద్దతిచ్చేది లేదన్నారు. ఆ రిపోర్టర్‌పై ఆన్‌లైన్ వేధింపులు తమను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story