Trump: నేనేంటో ప్రజలకు తెలుసు

Trump: నేనేంటో ప్రజలకు తెలుసు
రిపబ్లికన్ పార్టీ డిబేట్స్‌లో పాల్గొననని తేల్చి చెప్పిన అమెరికా మాజీ అధ్యక్షుడు

అమెరికా అధ్యక్షుడిగా పూర్తి పదవీకాలం పనిచేసిన తన గురించి దేశ ప్రజలకు బాగా తెలుసన్న ధీమా వ్యక్తం చేశారు ట్రంప్. ఇప్పుడు తాను మళ్ళీ అధ్యక్ష పదవి కోసం అభ్యర్థిత్వాన్ని బలపరచుకోవాల్సిన అవసరసం లేదన్నారాయన. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రధాన అభ్యర్థిగా రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఈసారి జరగబోయే డిబేట్లలో తాను పాల్గొనడం లేదని స్పష్టం చేశారు.

సాధారణంగా రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థులు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లుగా తమను తాము నిరూపించుకోవడానికి డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బుధవారం విస్కాన్సిన్లోని మిల్వాకీలో మొదట డిబేట్ జరగనుంది. అయితే తాను 62 శాతం బలంతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నానని అందుకే ఈ డిబేట్లో పాల్గొనడంలేదన్నారు డోనాల్డ్ ట్రాంప్. నిజానికి కొన్ని సర్వేలలో రిపబ్లికన్‌ ఓటర్లు, ట్రంప్‌పై వచ్చిన నేర విచారణలు ఆయన్ని పోటీ చేయకుండా నిరోధించే ఉద్దేశ్యంతో తెచ్చినవని నమ్ముతున్నామని ప్రకటించడమే దీనికి కారణం. ఇక రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ట్రంప్ తర్వాత రెండవ స్థానం కోసం ఫ్లోరిడా గవర్నర్ రోన్ డీసాంటిస్, భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి రేసు లో ఉన్నారు.


అయితే ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు.అతను 2016లో కూడా అదే పని చేసారు.2020లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కి వ్యతిరేకంగా జరిగిన రెండవ సాధారణ ఎన్నికల చర్చ నుంచి కూడా వైదొలిగారు.చర్చను దాటవేయాలని ట్రంప్ తీసుకున్న నిర్ణయం అధ్యక్షు రేసుపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఈ చర్చ తన పట్ల న్యాయంగా జరుగుతుందని తాను నమ్మడం లేదని కూడా అన్నారు.తన కొత్త స్ట్రీమింగ్ సర్వీస్, ట్రూత్ సోషల్‌లో తన అభిప్రాయం పంచుకుంటాను గానీ చర్చలకు మాత్రం రానని ఆయన స్పష్టం చేశారు.

మరివైపు కొత్త కొంతకాలంగా ట్రంప్ పై రకరకాల కేసుల ఉచ్చులు బిగసుకుంటున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు ట్రంప్ పై ఇప్పటికే నాలుగు అభియోగాలు నమోదు కాగా అవి ఇంకా విచారణ దశలో ఉన్నాయి. వాటిలో ఏమైనా నిరూపితమైతే ట్రంప్ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమవుతుంది. అప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి ఎలాంటి ఢోకా లేదనే చెప్పచ్చు.

Tags

Read MoreRead Less
Next Story