ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలకు ఫుల్‌స్టాప్‌

ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలకు ఫుల్‌స్టాప్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఆరోగ్యంపై నెలకొన్న పలు అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పడింది. కరోనా సోకడంతో ఆరోగ్యం క్షిణించిందని.. ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయి.. శ్వాసతీసుకోవడం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ఆరోగ్యంపై నెలకొన్న పలు అనుమానాలకు పుల్‌స్టాప్‌ పడింది. కరోనా సోకడంతో ఆరోగ్యం క్షిణించిందని.. ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయి.. శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా మారిందనే వార్తలు తొలగిపోయాయి. డెమోక్రటిక్‌ మద్ధతుదార్లతో పాటు అభిమానుల్లో వ్యక్తం అవుతున్న ఆందోళనలను పటాపంచలు చేశారు. సడెన్‌గా ప్రత్యక్షమయ్యారు. కారులో షికార్లు చేస్తూ అభిమానులు, మద్దతు దారులకు కనిపించారు. తన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పులేదనే సంకేతాలు ఇచ్చారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం పీక్ మీదున్న టైంలో ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. వైరస్ సోకిందని తెలుసుకున్న ట్రంప్ మొదటగా శ్వేతసౌధంలో స్వీయ నిర్భంధంలోకి వెళ్లారు. అనంతరం వైద్యుల సూచనల మేరకు మిలటరీ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ వార్తలొచ్చాయి. దీంతో ట్రంప్ మద్దతుదారులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాను బాగానే స్వయంగా ట్రంపే ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయినా ట్రంప్ మద్దతుదారుల్లో నెలకొన్న ఆందోళన తొలగిపోకపోవడంతో.. ఇలా సడెన్‌గా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఓ నల్లటి కారులో కూర్చుని.. తన మద్దతుదారుల మధ్య తిరిగారు. ఈ సందర్భంగా ఆయన.. తన అభిమానులకు అభివాదం చేశారు. చప్పట్లు కొట్టి వారిని ఉత్సాహ పరిచారు. తాను బాగానే ఉన్నానన్న భరోసా వారికి కలిగేలా చేశారు.

ట్రంప్ తీరును వైద్యనిపుణులు తప్పుబట్టారు. వైరస్ సోకిన వ్యక్తి నిబంధనల ప్రకారం బయట తిరగొద్దని తెలిసినా.. ట్రంప్ దాన్ని ఖాతరు చేయలేదని విమర్శిస్తున్నారు. కొవిడ్ నిబంధనలను ఆయన ఉల్లఘించారని ఆరోపించారు. అంతేకాకుండా ట్రంప్ ప్రయాణించిన కారులో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆరోగ్యంపట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతలో భాగంగా ట్రంప్‌తోపాటు కారులో ప్రయాణించిన సెక్యూరిటీ సిబ్బందిని.. 14 రోజులపాటు క్వారెంటైన్‌లో పెట్టాలని అభిప్రాయపడుతున్నారు. అటు ఇందంతా ఎన్నికల స్టంట్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు కరోనా చికిత్స పొందుతున్న వాల్టర్‌ రీడ్‌ మిలటరీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్టు ట్రంప్‌ ట్వీట్‌ చేశాడు. కరోనా బారిన నుంచి బయటపడడం ఆనందంగా ఉందన్నారు. కొవిడ్‌ టైంలో తనకు సపోర్ట్‌గా నిలిచిన మద్దతుదార్లు, ఫ్యాన్స్‌కు ట్రంప్‌ ధన్యవాదలు తెలియజేశారు.

Tags

Read MoreRead Less
Next Story