Abu Dhabi : రాచరికం ఉట్టిపడే ఖసర్ అల్వతన్

Abu Dhabi : రాచరికం ఉట్టిపడే ఖసర్ అల్వతన్
సంప్రదాయ అరబ్ నిర్మాణాన్ని చూసిద్దాం రండి

అల్లాద్దీన్ లో వర్ణించే అద్భుతాలను, ది ప్రిన్సెస్ డైరీస్ మూవీ లో కనిపించే రాచరికతను ఉట్టిపడేలా కనిపించే భవనం ఖసర్ అల్వతన్. గల్ఫ్ జలాల ఒడ్డున ప్రకాశవంతంగా ఈ మెరిసే భవనాన్ని చూడటానికి రబ్దాన్ అకాడమీ నుండి 60 మంది విద్యార్థులకు అవకాశం లభించింది.

విద్యా పర్యటన కోసం స్టూడెంట్స్ కు ఖసర్ అల్వతన్ Qasr Al Watan తలుపులు తెరిచింది. అకాడమీ యొక్క 'జహ్జీన్ యా వతన్' అనే వేసవి శిబిరంలో భాగంగా విద్యార్థుల జ్ఞానం, సాఫ్ట్ స్కిల్స్‌ను మెరుగుపరచమే ఈ పర్యటన లక్ష్యం.



ఈ సందర్బంగా విద్యార్థులు ప్యాలెస్‌లోని వివిధ జోన్‌లను పరిశీలించారు. అక్కడ చరిత్ర, సంప్రదాయాల యొక్క గొప్ప తనాన్ని తెలుసుకున్నారు. భవనానికి మధ్యలో ఉన్న ది గ్రేట్ హాల్ రాష్ట్ర ప్రముఖులకు ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రసిద్ధి చెందింది. సాంప్రదాయ అరబ్ నిర్మాణాల, ఆధునిక హంగులు సమ్మేళనం గా ఉండే ఈ భావనపు సౌందర్యాన్ని ఆణువణువూ ఆస్వాదించారు విద్యార్థులు. అలాగే దేశ విదేశాల నుంచి ఈ రాజులు అందుకున్న అద్భుతమైన బహుమతులను భవనంలో ఉంచడానికి ఉండే ఒక ఏర్పాటైన ఒక ప్రత్యేక గదిని విద్యార్థులు సందర్శించారు. ఆ దేశానికి ఇతర దేశాలతో ఉన్న బలమైన దౌత్య సంబంధాలను, ప్రపంచంలో ఆ దేశపు గుర్తింపును సూచిస్తుంది.


40 వేల పుస్తకాలు 16 మిలియన్ల కంటే ఎక్కువ డిజిటల్ కలెక్షన్ ఉన్న ఇక్కడి లైబ్రరీ ఇక్కడి సాంస్కృతిక వారసత్వ సంపదను తెలిపే హౌస్ ఆఫ్ నాలెడ్జ్‌ను విద్యార్థులు సందర్శించారు. ఇది తమకు వచ్చిన అద్భుతమైన అవకాశంగా వారు భావిస్తున్నామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story