పనిమనిషి కావాలట.. జీతం రూ.18 లక్షలట

పనిమనిషి కావాలట.. జీతం రూ.18 లక్షలట
అంతే కాదండోయ్ బాగా పని చేసి రాణీగారి మెప్పు పొందితే జీతం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందట

రాణీగారు.. రాయల్ ఫ్యామిలీ.. ఆ మాత్రం లేకపోతే ఎలా.. బ్రిటన్ రాణి ఎలిజబెత్ ప్యాలెస్‌లో పని చేయాలంటే మాటలు కాదు.. ఈ పోస్టుకు అప్లై చేసే అభ్యర్ధులకు ఇంగ్లీషు, లెక్కలు బాగా వచ్చుండాలి. 13 నెలల శిక్షణ అనంతరం అర్హత సాధించిన వారినే ఉద్యోగం వరిస్తుంది. పేరుకు హౌస్ కీపర్ అయినా అన్ని సదుపాయాలు ఉంటాయి రాణి నివాసంలో. వీరికి ఏడాదికి 33 సెలవులతో పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్, ట్రావెలింగ్ అలవెన్సులు కూడా ఉంటాయి. అర్హత గల అభ్యర్ధులు వెంటనే అప్లై చేసుకుని ఇంటర్వ్యూకు హాజరు కావాలని రాచకుటుంబం ప్రకటించింది.

అంతే కాదండోయ్ బాగా పని చేసి రాణీగారి మెప్పు పొందితే జీతం ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందట.. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 28. ఉద్యోగంలో మీరు చేసే పనులు ఇంటీరియర్ వస్తువులను చూసుకోవడం, వాటిని శుభ్రపరచడంతో పాటు వాటిపట్ల శ్రద్ధ వహించడం వంటివి చేయాల్సి ఉంటుంది. హూ.. బ్రిటన్‌లో అన్నా పుట్టాం కాదు అని నిట్టూరుస్తున్నారా.. అంతేగా మరి.

Tags

Read MoreRead Less
Next Story