ఇన్‌హెలర్‌లో దూరిన విషసర్పం.. భయంతో యువతి
ఇన్‌హేలర్ వాడి పక్కన పెట్టిన యువతి మళ్లీ ఉపయోగించడానికి తీసినప్పుడు అందులో పాము కనిపించే సరికి భయంతో వణికి పోయింది.

ఇంట్లో అటక మీదో, ఓ మూలో నక్కి భయపెట్టే పాముల్ని చూశాం కానీ.. ఇన్‌హేలర్‌లో దూరడం ఏమిటో అని ఆశ్చర్యపోతున్నారు పాములు పట్టేవాళ్లు సైతం. ఆస్తమా పేషెంట్లు వాడే ఇన్‌హేలర్‌లోకి దూరిన పాముని చూసి ఒక్కసారిగా షాక్‌తింది ఆస్ట్రేలియాకు చెందిన ఆ యువతి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో మొట్టమొదటిసారిగా ఇన్‌హేలర్ లోపల పాము కనిపించిన వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఇన్‌హేలర్ వాడి పక్కన పెట్టిన యువతి మళ్లీ ఉపయోగించడానికి తీసినప్పుడు అందులో పాము కనిపించే సరికి భయంతో బయటకు పరుగు పెట్టింది. స్నేక్ శాచర్‌కి సమాచారం అందజేయగా వారు వచ్చి దాన్ని బయటకు తీశారు. ఇది ఎర్ర-బొడ్డు నల్ల పాము అని విషపూరితమైనదని తెలిపారు.
తూర్పు ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఇటువంటి పాములు కనిపిస్తాయని చెప్పారు. అది విషపూరితమైనప్పటికీ దాని కాటుకు ఎవరూ గురికాలేదు. అడవులలో, చిత్తడి భూములలో దాని నివాసం ఏర్పరచుకుంటుంది. తరచుగా సమీప పట్టణ ప్రాంతాలలోకి ప్రవేశిస్తుంది
వీటి ప్రధాన ఆహార వనరు కప్పలు, చేపలు, సరీసృపాలు మరియు చిన్న చిన్న క్షీరదాలు. సాధారణంగా 1.25 మీటర్ల పొడవు వుంటుంది.
RELATED STORIES
Dhanush: ధనుష్ తమ కొడుకే అంటున్న దంపతులు.. చట్టపరంగా నోటీసులు పంపిన...
21 May 2022 3:55 PM GMTRakshit Shetty: నటితో రష్మిక ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ పెళ్లి.. క్లారిటీ...
21 May 2022 1:41 PM GMTKamal Haasan: జాతీయ భాషా వివాదంపై స్పందించిన కమల్.. మాతృభాషకు...
17 May 2022 9:41 AM GMTPallavi Dey: 21 ఏళ్ల బుల్లితెర నటి అనుమానాస్పద మృతి.. స్నేహితుడిపై...
16 May 2022 9:51 AM GMTUdhayanidhi Stalin: 'అదే యాక్టర్‌గా నా చివరి చిత్రం'.. యంగ్ హీరో...
14 May 2022 8:30 AM GMTSuriya: మల్టీ స్టారర్లో అన్నదమ్ములు.. ఆ హిట్ సినిమాకు సీక్వెల్లో..
13 May 2022 6:07 AM GMT