Pakistan: ఉక్రెయిన్‌కు పాక్ విలువైన ఆయుధాలు

Pakistan: ఉక్రెయిన్‌కు పాక్ విలువైన ఆయుధాలు
రూ.3 వేల కోట్లు మూటగట్టుకున్న పాకిస్థాన్‌

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌.. ఉక్రెయిన్‌కు ఆయుధాలను అమ్మి డబ్బు సంపాదించినట్లు తెలుస్తోంది. 150 M.M షెల్స్‌ విక్రయం ద్వారా 364 మిలియన్‌ డాలర్లను అర్జించినట్లు బీబీసీ వార్తా సంస్థ తెలిపింది. అమెరికన్ ఫెడరల్ ప్రొక్యూర్‌మెంట్ డేటా సిస్టమ్‌ నుంచి.. గ్లోబల్‌ మిలిటరీ, నార్త్‌రోప్‌ గ్రమ్మన్‌ సంస్థలతో కుదిరిన ఒప్పందం తాలూకు ఆధారాలను బహిర్గతం చేసింది. ఆయుధ ఎగుమతి ద్వారా తమ ఆధాయం 3వేల రెట్లు పెరిగిందని పాకిస్థాన్‌ కేంద్ర బ్యాంకు నివేదించిందని గుర్తు చేసింది. ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రధానిగా.. ఖమర్‌ జావేద్‌ బజ్వా ఆర్మీ చీఫ్‌గా ఉన్న సమయంలో ఈ విక్రయాలు జరిగాయని తెలిపింది. రావల్పిండి నుంచి సిప్రస్‌, అక్రొటిరి, రొమేనియా మీదుగా బ్రిటన్‌ సైనిక కార్గో విమానంలో ఆయుధ రవాణా జరిగినట్లు వెల్లడించింది. ఈ ఆరోపణలను పాకిస్థాన్‌ ఖండించింది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధంలో తాము తటస్థ వైఖరిని అవలంభిస్తున్నామనీ ఎవరికీ ఆయుధాలను విక్రయించలేదని ప్రకటించింది. పాకిస్థాన్‌ నుంచి తమకు ఆయుధాలు అందలేదని ఉక్రెయిన్‌ కూడా స్పష్టం చేసింది.

తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆర్థికంగా అధ్వాన్న స్థితిలో ఉన్న పాకిస్థాన్ 364 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు విక్రయించినట్టు నివేదికలు వెలువడడం చర్చనీయాంశం అవుతోంది. మందుగుండు సామాగ్రిని సరఫరా చేయడానికి గత ఏడాది రెండు ప్రైవేట్ అమెరికా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని , ఆయుధాలను సరఫరా చేసిందని మీడియా నివేదిక పేర్కొంది.


అమెరికన్ ఫెడరల్ ప్రొక్యూర్‌మెంట్ డేటా సిస్టమ్ వివరాల ప్రకారం , 155 ఎంఎం షెల్స్ విక్రయించడానికి పాకిస్థాన్ సైన్యం గ్లోబల్ మిలిటరీ, నార్త్రోప్ గ్రుమ్మన్ అనే రెండు అమెరికన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు బీబీసీ నివేదిక పేర్కొంది. ఈమేరకు 2022 ఆగస్టు 17న సంతకాలు జరిగినట్టు తెలియజేసింది. అయితే ఈ వార్తలను ఇస్లామాబాద్ లోని పాక్ విదేశాంగ కార్యాలయం ఖండించింది.

ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో పాకిస్థాన్ తటస్థ విధానాన్ని కొనసాగిస్తోందని, తాము ఎవరికీ ఆయుధాలు విక్రయించలేదని వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ లో అవిశ్వాసం ద్వారా ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ను తొలగించిన తరువాత ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story