Canada Wildfire: కెనడా వైపు దూసుకొస్తున్న కార్చిచ్చు,

Canada Wildfire: కెనడా వైపు దూసుకొస్తున్న కార్చిచ్చు,
ఎల్లోనైఫ్‌ను ఖాళీ చేయిస్తున్న అధికారులు

అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పుడు కెనడాకు వ్యాపించింది. అక్కడ హవాయి ద్వీపంలో వందల మందిని సజీవదహనం చేసి.. వేల ఇండ్లను దగ్ధం చేసిన దావానలం ఇప్పుడు ఉత్తర కెనడాపై విరుచుకు పడుతోంది. నార్త్‌ వెస్ట్‌ టెర్రిటరీస్‌ రాజధాని ఎల్లోనైఫ్ నగరం వైపు అగ్నికీలల వేగంగా వ్యాపిస్తుండడం వల్ల ప్రజలంతా ఖాళీ చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


కెనడాలో వెయ్యి 70 కార్చిచ్చులు క్రియాశీలకంగా ఉన్నాయని ఆ దేశ అగ్నిమాపక విభాగం తెలిపింది. వాటిలో 672 కార్చిచ్చులు అదుపులోకి రావడం లేదని వెల్లడించింది. మంటల ధాటికి ఇప్పటి వరకు లక్షా 36 వేల చదరవు కిలోమీటర్ల భూమి కాలిపోయిందని పేర్కొంది. కార్చిచ్చు ప్రభావం అధికంగా ఉన్న వాయవ్య ప్రాంతానికి అక్కడి ప్రభుత్వం 100 సైనికులను పంపించింది. మంటలను అదుపు చేయడంలో వీరు స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సహాయపడతారని అధికారులు తెలిపారు. అగ్నికీలలు చుట్టుముట్టడంతో ఎల్లోనైఫ్ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. వందల మందిని హెలికాప్టర్లు, విమానాల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు..

నగరంలో ఉండాలనుకుంటే మీతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే అంటూ అప్రమత్తం చేసింది. ప్రజలను తరలించేందుకు విమానాలను సిద్ధంగా ఉంచామని నగర మేయర్ రెబెక్కా ఆల్టీ తెలిపారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికీ అత్యంత క్లిష్ట సమయమని, వీలైనంత వరకు ఒకరికొకరు సాయం చేసుకోవాలని సూచించారు. వాహనంలో ఖాళీ ఉంటే ఇతరులను ఎక్కించుకోవాలని కోరారు. మూడు వేల మంది జనాభా కలిగిన హే రివర్‌ పట్టణంలో కూడా తరలింపు ప్రక్రియ జరుగుతోంది. 1989లో సంభవించిన కార్చిచ్చు వల్ల 76 వేల చదరపు కిలోమీటర్ల భూమి దహించుకపోగా ప్రస్తుతం దాని కంటే రెట్టింపు నేల కాలిబూడిదైందని వెల్లడించింది.


ఇలాంటి కార్చిచ్చే ఒకప్పుడు స్వర్గంలా ఉండే హవాయి ద్వీపంలోని మౌయి దీవిని నరకానికి నకలుగా మారింది. సంఖ్య 100 ని పొట్టన పెట్టుకుంది. 3 వేలకు పైగా జంతువులు మృత్యువాత పడ్డాయి. ఇప్పటికీ శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం గాలిస్తున్నారు. వెయ్యి డిగ్రీల ఫారెన్‌హీట్ (538 డిగ్రీల సెల్సియస్) ను దాటి వేడి జ్వలించింది. ఈ మంటల ధాటికి ఏకంగా లోహాలు కూడా కరిగిపోయాయి. 2 వేల 200లకు పైగా నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. వందలాది వాహనాలు నామరూపాల్లేకుండా పోయాయి.

Tags

Read MoreRead Less
Next Story