Russia: స్పూత్నిక్ వాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త దారుణ హత్య

Russia: స్పూత్నిక్ వాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త దారుణ హత్య
బెల్టును మెడకు బిగించి శాస్త్రవేత్తను హత్య చేసిన దుండగుడు...

కోవిడ్ 19 వాక్సిన్ ను కనిపెట్టిన రష్యా శాస్త్రవేత్త ఆండ్రే బోటికవ్ అనుమానస్పది స్థితిలో మృతిచెందారు. అతడి స్వగృహంలోనే మెడకు బెల్డ్ బిగించిన స్థితిలో పోలీసులు ఆండ్రే మృతదేహాన్ని కనుగొన్నారు. గామాలేయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకాలజీ అండ్ మాథ్మెటిక్స్ లో సీనియర్ రీసెర్చర్ గా పనిచేస్తున్న ఆండ్రే(47) హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు. మెరపువేగంతో దర్యప్తు చేస్తున్న పోలీసులు ఈ మేరకు ఓ వ్యక్తిని అరెస్ట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. 29ఏళ్ల యువకుడు ఆండ్రేతో గొడవపడి, అతడిని హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఇరువురి మధ్యా వాగ్వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో ఆండ్రే మెడకు బెల్ట్ బిగించి హత్యచేసినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన కాసేపటికే పోలీసులు ఆండ్రే మృతదేహాన్ని కనుగొన్నారని తెలుస్తోంది. 2021లో కోవిడ్ వ్యాక్సిన్ ను కనుగొన్నందుకు గానూ ఆండ్రేని దేశ అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగతంగా ఫాదర్ ల్యాండ్ పురస్కారంతో సత్కరించారు. స్పూత్నిక్ వీ వాక్సిన్ ను అభివృద్ధి చేసిన 18మంది శాస్త్రవేత్తల బృందంలో ఆండ్రే ఒకరు.

Tags

Read MoreRead Less
Next Story