అంతర్జాతీయం

కరోనా మళ్లీ విజృంభిస్తోందా.. ఒక్కరోజులో 16వేల కేసులు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,521 కేసులు నమోదైనట్లు

కరోనా మళ్లీ విజృంభిస్తోందా.. ఒక్కరోజులో 16వేల కేసులు
X

మహమ్మారి కరోనాను మర్చిపోయి మామూలు జీవితాన్ని గడుపుదామనుకుంటే కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కాస్త తగ్గుముఖం పట్టినా రష్యా వాసుల్ని మాత్రం వైరస్ వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,521 కేసులు నమోదైనట్లు అక్కడి రెస్పాన్స్ సెంటర్ ఆదివారం వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 15,13,877కు చేరుకుంది. రష్యాలో అత్యధిక కేసులు రాజధాని మాస్కో నుంచి నమోదవుతున్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా మృతి చెందిన వారు 229 మంది. దీంతో మొత్తం ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారు 26,050కు చేరుకుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో రష్యా నాలుగో స్థానంలో ఉండగా.. మొదటి మూడు స్థానాలు అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి.

Next Story

RELATED STORIES