మార్కెట్లో రష్యా వ్యాక్సిన్

మార్కెట్లో రష్యా వ్యాక్సిన్
రష్యా తన వ్యాక్సిన్ ను భారత్ లో మూడో దశ ప్రయోగాలు జరిపి మార్కెట్లోకి విడుదల చేయడానికి సంన్నద్ధమైంది.

రష్యాకు చెందిన గమలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ ( ఆర్‌డిఐఎఫ్ ) చే అభివృద్ధి చేయబడిన కోవిడ్ వ్యాక్సిన్ స్పుత్నిక్ విని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందని రష్యన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలియజేస్తుంది. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆగస్టు 11 న స్పుత్నిక్ వి అనే కోవిడ్ -19 పై మొదటి టీకాను నమోదు చేసింది. రష్యా తన వ్యాక్సిన్ ను భారత్ లో మూడో దశ ప్రయోగాలు జరిపి మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నద్ధంగా ఉంది. దీనికి సంబంధించి రష్యా నుంచి ప్రతిపాదనలు అందినట్లుగా నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.పాల్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనల్ని మన దేశంలో పలు మెడికల్ కంపెనీలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలు రష్యా వ్యాక్సిన్ కు అనుమతులు మంజూరు చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story