Russia: రష్యాపై ఉక్రెయిన్​ అతి పెద్ద డ్రోన్ల దాడి..

Russia: రష్యాపై ఉక్రెయిన్​ అతి పెద్ద డ్రోన్ల దాడి..
ఆరు ప్రాంతాల్లో భారీగా ఆస్తుల నష్టం

రష్యాపై ఉక్రెయిన్‌ మరోసారి డ్రోన్లతో విరుచుకుపడింది. ఏకంగా రష్యాలోని ఆరు ప్రాంతాలపై ఉక్రెయిన్‌ వరుస దాడులు జరిపింది. దాదాపు 20కి పైగా డ్రోన్లు, రాకెట్లు రష్యన్‌ ప్రాంతాలపై విరుచుకుపడ్డాయి.ఈ దాడిలో పెద్ద మెుత్తంలో ఆస్తి నష్టం జరిగింది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మెుదలైన తర్వాత రష్యా గడ్డపై జరిగిన అతిపెద్ద డ్రోన్‌ దాడి ఇదేనని రష్యన్‌ బలగాలు తెలిపాయి. రష్యాపై దాడులను ఉక్రెయిన్‌ మరింత ఉధృతం చేసింది.


బుధవారం తెల్లవారుజామున మరోసారి రష్యాపై వరుస దాడులు జరిపింది. రష్యాలోని ఆరు ప్రాంతాలపై ఉక్రెయిన్‌ డ్రోన్లు,రాకెట్లు విరుచుకుపడ్డాయి.దాదాపు 20కి పైగా డ్రోన్లు, రాకెట్లు...రష్యన్‌ ప్రాంతాలపై దాడి చేశాయి. మాస్కో,పొస్కోవ్‌,బ్రియాన్స్క్‌,ఓర్లోవ్,రియాజాన్,కలుగ ప్రాంతాలపై ఉక్రెయిన్‌ బలగాలు దాడులు చేశాయి.రష్యా వాయవ్య ప్రాంతమైన పొస్కోవ్‌ నగరంలోని విమానాశ్రయంపై డ్రోన్‌ దాడి జరిగినట్లు అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. ఈ దాడిలో నాలుగు ఐఐ-76 సైనిక రవాణా విమానాలు దెబ్బతిన్నాయని వెల్లడించాయి. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం మెుదలైన తర్వాత..రష్యా గడ్డపై ఉక్రెయిన్‌ చేసిన అతిపెద్ద డ్రోన్‌ దాడి ఇదేనని రష్యన్‌ బలగాలు తెలిపాయి. ఉక్రెయిన్ దాడితో పొస్కోవ్‌, మాస్కో ప్రాంతాల్లో పలు విమానాలు రద్దయ్యాయి.


బ్రియాన్స్క్‌ ప్రాంతంలోని టీవీ టవర్‌పై ఉక్రెయిన్‌ దాడి యత్నించినట్లు రష్యన్‌ బలగాలు పేర్కొన్నాయి.డ్రోన్ల దాడి సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగినట్లు పేర్కొన్నాయి. ఈ డ్రోన్‌ దాడిని తాము తిప్పికొట్టినట్లు రష్యన్‌ బలగాలు వెల్లడించాయి. డ్రోన్లపై తమ సైన్యం ఎదురుదాడి చేసినట్లు తెలిపాయి. ఇది ఉక్రెయిన్‌ సైన్యం పనేనని ఆరోపించిన రష్యన్‌ బలగాలు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించాయి.ఈ దాడిపై ఉక్రెయిన్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Tags

Read MoreRead Less
Next Story