Russia : ఉక్రెయిన్ విషయంలో తగ్గేదేలే…

Russia : ఉక్రెయిన్ విషయంలో తగ్గేదేలే…
మాస్కో న‌గ‌రంపై డ్రోన్ల దాడితో మండి పడుతున్న రష్యా

ర‌ష్యా రాజ‌ధాని మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్ల‌తో దాడి చేసింది. వరుసగా రెండు డ్రోన్లు గగన తలం లోకి చొచ్చుకు వచ్చాయి. ఆ దాడిలో ఎవ‌రూ గాయ‌ప‌డ‌లేదు. నాన్‌-రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్‌ల‌పై రెండు యూఏవీలు అటాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఒక డ్రోన్ రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయానికి 200 మీటర్ల దూరంలో దూసుకు వచ్చింది. ఎల‌క్ట్రానిక్‌ డివైస్‌ల ద్వారా ర‌ష్యా ఆర్మీ ఆ డ్రోన్ల‌ను నేల‌కూల్చింది. మాస్కో సెంట‌ర్‌లో ఉండే కాంసోమాల‌స్కీ ప్రోస్పెక్ట్ బిల్డింగ్ వ‌ద్ద ఈ డ్రోన్లు హడావిడి చేశాయి. డ్రోన్ పేలుడు ధాటికి బిల్డింగ్‌లో ఉన్న అద్దాల కిటికీలు ప‌గిలిపోయాయి. ద‌క్షిణ మాస్కోలో ఉన్న బ‌హుళ అంత‌స్థు భ‌వ‌నంపై రెండో డ్రోన్ దాడి చేసింది. ఆ రూట్లో రోడ్డును మూసివేశారు. మాస్కోపై జ‌రిగిన డ్రోన్ దాడి అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదం అవుతుంద‌ని ర‌ష్యా విదేశాంగ మంత్రి మారియా ఆరోపించారు. మరోవైపు క్రిమియాలు ఆయుధం డిపో పైన డ్రోన్లు దాడి చేశాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు. ఈ డ్రోన్లు దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున కీవ్‌పై రష్యా వైమానిక దాడి చేసింది.కీవ్ శివార్లలో వాయు రక్షణ వ్యవస్థ రష్యా దాడిని తిప్పికొట్టడంలో నిమగ్నమై ఉన్నాయని స్థానిక అడ్మినిస్ట్రేషన్ హెడ్ సెర్హి పాప్కో తెలిపారు.


అటు దక్షిణ ఉక్రెయిన్ లోని నల్ల సముద్ర తీర పట్టణాలపై మాస్కో దాడులు కొనసాగుతున్నాయి. డాన్యూబ్ నది పక్కన ఉన్న ఓడరేవులను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ఉపయోగించింది . ధాన్య ఒప్పందం నుంచి వైదొలగినప్పటి నుంచి రష్యా ఉక్రెయిన్ పై గురి పెట్టిన సంగతి తెలిసిందే.

మరోవైపు రష్యా ఆక్రమించిన సగం భూభాగాన్ని ఉక్రెయిన్ సొంతం చేసుకున్నట్లుగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ వెల్లడించారు. ఈ భూభాగాన్ని విడిపించుకోవడానికి ఉక్రెయిన్ చాలా కష్టపడిందన్నారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఎదురుదాడి ఇలానే రోజులు, వారాలు కాదు నెలలపాటు కొనసాగుతుంది అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story