RUSSIA: రష్యా జాబిల్లి ప్రయోగం వేళ ఊరే ఖాళీ

RUSSIA: రష్యా జాబిల్లి ప్రయోగం వేళ ఊరే ఖాళీ
50 ఏళ్ల తర్వాత జాబిల్లిపైకి రష్యా ల్యాండర్‌.... ఈ నెల 11న ప్రయోగం... ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రోస్‌ కాస్మోస్‌

అర్ధ శతాబ్దం తర్వాత జాబిల్లిపై ప్రయోగానికి(r first lunar lander mission in half century) రష్యా సిద్ధమైంది. చంద్రుడి అంతర్గత నిర్మాణం, నీళ్లతో సహా అక్కడి వనరులను అధ్యయనం చేసేందుకు లూనా-25 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ నెల 11న(August 11 ) ఈ ప్రయోగాన్ని రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. దీని కోసం అంతరిక్ష ప్రయోగం కేంద్రం సమీపంలోని గ్రామాన్ని కూడా ఖాళీ చేయించారు.


దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మళ్లీ ల్యాండర్‌ను పంపించేందుకు రష్యా సిద్ధమైంది. ఆగస్టు 11న ఆ దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌ కాస్మోస్‌ జాబిల్లిపైకి ల్యాండర్‌ను పంపనుంది. మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతంలో ఈ ప్రయోగం జరగనుంది. సొయుజ్‌-2 ఫ్రిగట్‌ బూస్టర్‌ను మోసుకుని లూనా-25 నింగిలోకి దూసుకెళ్లనుంది.


అయితే, ఈ ప్రయోగంలో రాకెట్‌ బూస్టర్లు( rocket boosters) ల్యాండర్‌ నుంచి విడిపోయిన తర్వాత(l fall after they separate) భూమిపైనే పడనున్నాయి. ఇందుకోసం రష్యా ఓ గ్రామాన్ని ఖాళీ‍(Russia to evacuate village) చేయిస్తోంది. రాకెట్‌ బూస్టర్లు.. ఉమల్టా, ఉస్సామఖ్‌, లేపికన్‌, తస్తాఖ్‌, సగ్నార్‌ నదులు, బురేయా నదిలోని ఫెర్రీ క్రాసింగ్‌ ప్రాంతాల్లో.. పడే అవకాశాలు ఉన్నట్లు రష్యా శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రయోగ వేదికకు ఆగ్నేయం వైపునున్న షక్తిన్‌స్కీ గ్రామంలో ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఆగస్టు 11వ తేదీ తెల్లవారుజాము కల్లా ఈ ప్రాంతంలో ప్రజలను ఖాళీ చేయించనున్నట్లు తెలుస్తోంది.


1976 తర్వాత రష్యా చేపడుతున్న(Russia's first since 1976) తొలి లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగం ఇది. తొలిసారి జాబిల్లిపై దక్షిణ ధ్రువంలో దీన్ని ల్యాండ్‌ చేసేలా రూపొందించారు. చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి, జాబిల్లి ఉపరితలంపై పరిశోధనలు, అక్కడి వనరుల జాడను గుర్తించేందుకు ఈ ప్రయోగం చేపడుతున్నట్లు రోస్‌కాస్మోస్‌ వెల్లడించింది. లూనా-25 కేవలం ల్యాండర్‌ మిషన్‌ మాత్రమే. కేవలం 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తోంది. ఇందులో చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్‌ చేతులు, డ్రిల్లింగ్‌ హార్డ్‌వేర్‌తో పాటు ఇతర శాస్త్రీయ పరికరాలను దీంతోపాటు పంపించనున్నారు. ఇది సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్‌ అయితే ఏడాది పాటు జాబిల్లిపై విధులు నిర్వర్తించనుంది.

Tags

Read MoreRead Less
Next Story