రష్యాకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుందాం: వాగ్నర్‌ గ్రూప్‌

రష్యాకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుందాం: వాగ్నర్‌ గ్రూప్‌
రష్యాకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుందామని వాగ్నర్‌ గ్రూప్‌ ప్రకటన

రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబావుటా ఎగరేసిన.. యెవ్‌జనీ ప్రిగోజిన్‌ నేతృత్వంలోని వాగ్నర్‌ గ్రూప్‌ కీలక ప్రకటన చేసింది. రష్యాకు త్వరలో కొత్త అధ్యక్షుడు ఎన్నిక కాబోతున్నాడని వాగ్నర్‌ గ్రూప్‌ ప్రకటించింది. జాతిని ఉద్దేశించి పుతిన్‌ ప్రసంగించిన కాసేపటికే.... వాగ్నర్‌ గ్రూప్‌ దేశ ప్రజలను ఉద్దేశించి ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాకు తాను ద్రోహం చేశానన్నపుతిన్ వ్యాఖ్యలను ప్రిగోజిన్ ఖండించారు. తన తరఫున పోరాటం చేస్తున్న వారిని దేశ భక్తులుగా ప్రిగోజిన్‌ పేర్కొన్నారు. దేశం అవినీతిలో కూరుకుపోతుంటే తాను చూస్తూ ఊరుకోబోనని.. పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.పుతిన్‌పై తిరుగుబావుటా ఎగరేసిన వాగ్నర్‌ ప్రైవేట్‌ సైన్యం... ఇప్పటికే రెండు కీలకమైన నగరాలను తమ ఆధీనంలోకి తీసుకుంది. రోస్టోవ్ ఆన్ డాన్, వొరోనెజ్‌ నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రిగోజిన్ ప్రకటించాడు. ప్రిగోజిన్ యుద్ధం ప్రకటించడంపై... పుతిన్ మండిపడుతున్నారు. ప్రిగోజిన్ నిర్ణయాన్ని... దేశద్రోహంగా, వెన్నుపోటు చర్యగా పుతిన్ అభివర్ణించారు. తీవ్రమైన నేరపూరిత సాహసానికి ప్రిగోజిన్ ఒడిగట్టారని వ్యాఖ్యానించారు. సాయుధ తిరుగుబాటును.... తీవ్రమైన నేరంగా పుతిన్ అభివర్ణించారు. తిరుగుబాటుదారుల నుంచి తమ దేశాన్ని, ప్రజలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. తిరుగుబాటు దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story