Russia : ఈసారి చర్చిని కూల్చింది.

Russia :  ఈసారి చర్చిని కూల్చింది.
పురాతన చర్చి తో సహా ఆరు నివాస భవనాలు ధ్వంసం

ఉక్రయిన్ లోని ఒడెసా నగరం లోని ఒక ప్రముఖ చర్చి ని రష్యా కూల్చి వేసింది. నిన్న రాత్రి ఈ నగరం పై జరిగిన దాడుల్లో పురాతన చర్చి తో సహా ఆరు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. ఈ చర్చి దేశంలోని ప్రముఖ నిర్మాణ చిహ్నాల్లో ఒకటని ఒకరైన దక్షిణ ఆపరేషన్ కమాండ్ పేర్కొంది. ఇప్పటి ప్రధాన నగరాల మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులకు తెగబడిన రష్యా.. ఇప్పుడు ఉక్రెయిన్ లోని ప్రముఖ చర్చిని క్షిపణి దాడితో నేలమట్టం చేసింది. ఈ ఘటనలో ఓ పౌరుడు మృతిచెందాడనీ చిన్నారులతో సహా మొత్తం 19మంది గాయపడ్డారని,


డజన్ల కొద్దీ కార్లు, అనేక ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. రష్యా దాడుల వల్ల నగరంలో విద్యుత్తు, ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలు దెబ్బతిన్నాయని తెలిపింది. తాజాగా దాడి జరిగిన ప్రముఖ చర్చి ఒడెస్సాలోనే అతి పెద్దది. దీనిని 1809లో వినియోగంలోకి తీసుకొచ్చారు. 1939లో సోవియట్ యూనియన్ ఈ చర్చిని ధ్వంసం చేయగా.. 2003లో పునరుద్ధరించారు. ఉక్రెయిన్ సాంస్కృతిక నిర్మాణాలపై దాడులు చేయవద్దని ఐరాసకు చెందిన యునెస్కో.. రష్యాకు విజ్ఞప్తి చేస్తున్నా.. మాస్కో వీటిని పెడచెవిన పెడుతోంది. ఇక శనివారం రాత్రి జరిగిన దాడిలో ఒకరు మృతి చెందగా 19 మంది గాయపడినట్టు సమాచారం. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. గత వారం రోజుల నుంచి రష్యా చాలా వరకు దాడులను నల్ల సముద్రం పైనుంచే చేస్తోంది. గత సోమవారం ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న ఆహార ధాన్యాల ఒప్పందం నుంచి రష్యా వైదొలిగిన నాటి నుంచిఉక్రయిన్ పై దాడులు తీవ్రతరం చేసింది. మీ దాడులలో గత వారం రోజులలో 60 వేలు టన్నుల ధాన్యాలు ధ్వంసం అయ్యాయి.

నల్ల సముద్రంలో తన నౌకాశ్రయాల ద్వారా ఉక్రెయిన్ ధాన్యాన్ని సురక్షితంగా రవాణా చేయడానికి అనుమతించే అంతర్జాతీయ ఒప్పందాన్ని పొడిగించడానికి రష్యా నిరాకరించింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ, ఇక నుండి నల్ల సముద్రంలోని ఉక్రేనియన్ నౌకాశ్రయాలకు ప్రయాణించే అన్ని నౌకలు మిలిటరీ కార్గో యొక్క వాహకాలుగా పరిగణించబడతాయని పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story