Salena Gomez: ఆకారం చూసేవాళ్లు నాకొద్దు.. అంటోన్న బొండుమల్లి..

Salena Gomez: ఆకారం చూసేవాళ్లు నాకొద్దు.. అంటోన్న బొండుమల్లి..
భారీగా ఒళ్లు చేసిన పాప్ స్టార్; ట్రోలింగ్ పై మండిపడ్డ సెలీనా; మందుల వల్లే ఇలా అయ్యానంటూ ట్వీట్...
పాప్ సింగర్ సెలీనా గోమెజ్ తన పాటల కన్నా కాంట్రావర్శీలతోనే ఎక్కువగా వార్తలకు ఎక్కుతూ ఉంటుంది. జస్టిన్ బీబర్ తో బ్రేక్ అప్ దగ్గర నుంచి అమ్మడిది ఇదే తంతు. క్రమంగా ఆనారోగ్య సమస్యలు, ఆమెలో చోటుచేసుకుంటోన్న మార్పులతో సెలీనా ఏదొకరకంగా ఇబ్బందులకు లోనవుతూనే ఉంది. తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ పై తళుక్కుమంది సెలీనా. అయితే ఆమెలో మునుపటి ఆత్మవిశ్వాసం మాత్రం మిస్ అయిందనే చెప్పాలి. భారీగా ఒళ్లు చేసిన సెలీనా కెమెరాలకు ఫోజులు ఇవ్వడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ కు గురైంది సెలీనా. అయితే ట్రోలింగ్ కు ఏమాత్రం బెదరని బొండుమల్లి వారికి గట్టి కౌంటర్ ఇచ్చిందనే చెప్పాలి. తాను మోడల్ ను కానని, సింగర్ ను మాత్రమేనని స్పష్టం చేసింది. తనను ఇలా చూడటం ఇష్టం లేకపోతే వెళ్లిపోవచ్చునని వెల్లడించింది. అనారోగ్య సమస్యలకు తీసుకుంటోన్న మందుల వల్లే ఒళ్లు చేశానని, ప్రస్తుతం ఆమె దృష్టి అంతా తన ఆరోగ్యం కాపాడుకోవడం మీదే ఉందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story